ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nandyal: భక్తులకు శుభవార్త.. ఆ రోజుల్లో వీఐపీ దర్శనాలు రద్దు..

ABN, Publish Date - Dec 03 , 2024 | 02:05 PM

శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సెలవులు, భక్తులు రద్దీగా ఉండే శని, ఆది, సోమవారాలలో, వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Srisailam Temple

నంద్యాల: శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సెలవులు, భక్తులు రద్దీగా ఉండే శని, ఆది, సోమవారాలలో, వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా రోజుల్లో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని ఈవో వెల్లడించారు. శని, ఆది, సోమవారాలు, రద్దీ రోజుల్లో ఉదయాస్తమాన, ప్రదోషకాల, ప్రాతకాల, గర్భాలయ, సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలుపుదల చేస్తూ ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లో స్పర్శదర్శనం, అభిషేకాల రద్దు వివరాలను క్యాలెండర్ రూపంలో విడుదల చేయనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.

Updated Date - Dec 03 , 2024 | 02:07 PM