ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP Satya Kumar: ధరణి కన్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పది రెట్లు ప్రమాదకరం

ABN, Publish Date - Jan 21 , 2024 | 07:22 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ధరణి కన్నా పది రెట్లు ప్రమాదకరం అని బీజేపీ విమర్శిస్తోంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో కుంభకోణాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ ఆస్తులను ప్రజలు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకోకుంటే 22ఏలో చేర్చే అవకాశం ఉందని వివరించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ధరణి కన్నా పది రెట్లు ప్రమాదకరం అని బీజేపీ (BJP) విమర్శిస్తోంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ వల్ల కుంభకోణాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు తమ ఆస్తులను ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకోకుంటే 22ఏలో చేర్చే అవకాశం ఉందని వివరించింది. దీంతో వారి ఆస్తులు వివాదాస్పద జాబితాలో వెళతాయని పేర్కొంది. తర్వాత ప్రజలు తమ ఆస్తుల గురించి కోర్టులో (Court) అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని వివరించింది. బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ శనివారం నాడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని సత్యకుమార్ అంటున్నారు. అందుకోసమే తుగ్లక్ చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు.

దక్షిణాదిలో బీజేపీ బలపడుతుందని సత్యకుమార్ ధీమాతో ఉన్నారు. తమ పార్టీకి లోక్ సభ సీట్లు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠలో ప్రతి హిందువు భాగస్వామ్యం అయ్యారని సత్యకుమార్ వివరించారు. మరికొన్ని గంటల్లో రామజన్మభూమిలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అయోధ్యపురి ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. రామనామ స్మరణతో అయోధ్య వీధులు మారుమోగుతున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 21 , 2024 | 07:23 AM

Advertising
Advertising