weather updates : అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ABN , Publish Date - Dec 18 , 2024 | 06:36 PM
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం.. మరింత బలపడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం.. మరింత బలపడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా సమీపం నుంచి ఉత్తర దిశగా పయనిస్తూ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకబోతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల పాటు కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుసే సూచలున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతం కాకముందే ప్రజలు అలర్ట్ అయ్యి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. రైతులు కూడా పంటలను కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
అల్పపీడనం ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీరప్రాంతం ఇప్పటికే అల్లకల్లోలంగా మారింది. కెరటాల ఉద్ఢృతికి కోనపాపేటలో 15 ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. కొత్తపల్లి మండలంలో తీర ప్రాంతాలైన ఉప్పాడ, అమీనాబాద్ కోనపాపపేట గ్రామాల్లో కోతకు ఇల్లు కోతకు గురవుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో సముద్ర అలల తాకిడికి ఏటా తీరప్రాంతానికి ఆనుకుని ఉన్న గృహాలు నేలమట్టం అవుతూనే ఉంటాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.