ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Budha Venkanna: ఎంసీపీ సూపర్ డూపర్ హిట్.. ఫలితాలు చూశాక ఆశ్చర్యపోతారు

ABN, Publish Date - May 15 , 2024 | 11:36 AM

MCP (మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్) మల్టీస్టార్ మహా కూటమి ఎపీలో సూపర్ డూపర్ హిట్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతోందన్నారు. 2019లో జగన్‌ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటోడినా గెలిపించిందని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారని బుద్దా వెంకన్న తెలిపారు.

విజయవాడ: MCP (మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్) మల్టీస్టార్ మహా కూటమి ఎపీలో సూపర్ డూపర్ హిట్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతోందన్నారు. 2019లో జగన్‌ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటోడినా గెలిపించిందని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. ఈ ఎన్నికలలో జగన్‌ను ఓడించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తరలి వచ్చారన్నారు. జగన్ (CM Jagan) పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయనను సాగనంపేలా కూటమికి ఓట్లు వేశారన్నారు. 2019 లో 79శాతం పోలైతే నేడు 81 శాతం పోలింగ్ జరిగిందని బుద్దా వెంకన్న తెలిపారు.

AP News: పాత కేసులతో టీడీపీ నేతల అరెస్ట్


ఫైళ్లు మాయం చేసేందుకే ఈ ప్రకటనలు..

జగన్‌పై వ్యతిరేక ఓటు వేసేందుకు తెల్లవారు జాము నుంచే ఓటర్లు బారులు తీరారు. ఐదారు గంటలు ఆలస్యం అయినా.. ఓపికగా వేచి ఉండి జగన్‌ను సాగనంపాలనే లక్ష్యంతో ఓట్లు వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఒక రికార్డు. అమరావతి వేదికగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. అమరావతిని అభివృద్ధి చేస్తామన్న జగన్ రాజధాని లేకుండా సర్వనాశనం చేశారు. వైసీపీ గెలుస్తుంది, జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స, సజ్జల ప్రకటించారు. ఐదేళ్లల్లో అవకతకవకలకు పాల్పడిన వారు ఫైళ్లు మాయం చేసేందుకే ఈ ప్రకటనలు. చంద్రబాబు వంటి నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టారని కక్షతో ప్రజలు జగన్ కు ఓడించాలని ఓట్లు వేశారు. నారా కుటుంబంలో ఉన్న నలుగురు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి నాలుగు దిక్కులుగా మారి ప్రచారం చేశారు.

TS News: త్వరలో ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వకం


బొత్స సత్యనారాయణది మేకబోతు గాంభీర్యం..

పవన్ కల్యాణ్ కూడా అక్రమ అరెస్టుపై స్పందించి చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. ఒక దొంగను తరిమి కొట్టేందుకు నిజాయతీ పరులు అందరూ ఒకటయ్యారు. భేషరతుగా మద్దతు పలికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు. ఓటమి విషయం తెలిసి కూడా బొత్స సత్యనారాయణ మేకబోతు గాంభీర్యం పోతున్నారు. బొత్స సతీమణి ఝాన్సీ కూడా అక్కడ ఓడిపోతున్నారనేది వాస్తవం. కేవలం కొన్ని ఫైళ్లు పనులు చేసుకునేందుకు బొత్స ఇలా మాట్లాడుతున్నారు. ఏడాదికి జగన్ ఇచ్చే రూ.15 లేదా 20 వేలతో కుటుంబాలు గడిచిపోతాయా? పేదలు సంపాదించుకోకండా.. తాను ఇచ్చే తాయిలాలు కోసం ఎదురుచూడాలని జగన్ భావించాడు. మహా కూటమి 130కి పైగా సీట్లు వస్తాయి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి 40వేల ఓట్లతో గెలుస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు చూశాక మరింత ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి...

AP News: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం.. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా..

AP Elections 2024: ఏపీలో చెలరేగిన వైసీపీ మూకలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 11:36 AM

Advertising
Advertising