AP Assembly: మేము గర్వంగా చెబుతున్నాం: బుగ్గన

ABN , First Publish Date - 2024-02-07T11:52:34+05:30 IST

Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు వైసీపీ ప్రభుత్వం చేసిందని గర్వంగా చెబుతున్నానన్నారు.

AP Assembly: మేము గర్వంగా చెబుతున్నాం: బుగ్గన

అమరావతి, ఫిబ్రవరి 7: ఏపీ అసెంబ్లీలో (AP Assembly) మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు వైసీపీ ప్రభుత్వం (YCP Government) చేసిందని గర్వంగా చెబుతున్నానన్నారు. సుపరిపాలన ఆంధ్ర, సామర్ధ్య ఆంధ్ర, మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్రను సాధించామని చెప్పుకొచ్చారు. పాలనా పరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీసు డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్త రెవెన్యూ, పోలీసు డివిజన్లను కుప్పంలో కూడా ఏర్పాటు చేశామన్నారు. అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేసినట్లు చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.2356 కోట్లతో పనులు చేపట్టామన్నారు. సామర్ధ్య ఆంధ్రా ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నామన్నారు. మానవ మూలధన అభివృద్ధికి గత ఐదేళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో పెట్టుబడి పెట్టినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ABN ఛానల్ ఫాలో అవ్వండి
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2024-02-07T11:55:28+05:30 IST