ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: ఓటు వేసేందుకు ఓటర్ కార్డే ఉండాలా.. ఎన్నికల అధికారి ఏమన్నారంటే..

ABN, Publish Date - Mar 16 , 2024 | 05:46 PM

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పూర్తి వివరాలు వెల్లడించారు. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరుతాయని తెలిపారు.

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పూర్తి వివరాలు వెల్లడించారు. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరుతాయని తెలిపారు. మే 13న జరగనున్న పోలింగ్ ( Polling ) కు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 175 అసెంబ్లీ, 25 పార్లిమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్న ఎస్ఈసీ రాష్ట్రంలో 4 కోట్ల 9 లక్షలు 37వేల352 మంది ఓటర్లు ఉన్నారన్నారు. తుది ఓటర్‌ల జాబితా నుంచి ఇప్పటి వరకు 2 నెలల్లోనే లక్ష 97 వేల మంది కొత్తగా జాయిన్ అయ్యారని వివరించారు. 1500 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్‌లకు డివిజన్ చేసి మరో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సారి జరగనున్న ఎన్నికల కోసం 219 కొత్త పోలింగ్ స్టేషన్ లు యాడ్ చేస్తున్నామన్నారు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో మహిళల బాధ్యత తీసుకునేలా నిర్ణయం తీసుకున్నామని ముకేశ్ కుమార్ చెప్పారు. వారికి ఎపిక్ కార్డ్ లు పంపిణీ చేస్తామన్నారు. 5 రోజుల ముందే ఓటర్లకు స్లిప్స్ ఇస్తామని పేర్కొన్నారు. ఓటు వేసేందుకు 12 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి ఉంటుందని ఎన్నికల కమిషనర్ అన్నారు.


"85 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగుల సౌకర్యార్థం పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేస్తున్నాం. వారికి 10 రోజుల ముందే పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం. నామినేషన్ ప్రాసెస్ లో ఈ సారి ఆన్లైన్ నామినేషన్ ఇవ్వవచ్చు. అయితే అప్లికేషన్ ఫిజికల్ గా ఇవ్వాలి. క్రిమినల్ కేసులు ఉన్నవారు 3 సార్లు పోలింగ్ కు ముందు వారి కేసుల వివరాలు పబ్లిష్ చేసుకోవాలి. పొలిటికల్ పార్టీ లు వారి వెబ్సైట్ లో కేసుల వివరాలు ఇవ్వాలి."

- ముకేశ్ కుమార్ మీనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2024 | 05:46 PM

Advertising
Advertising