ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: అనపర్తి టికెట్ విషయంపై పురందేశ్వరి‌తో చర్చించా: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

ABN, Publish Date - Apr 06 , 2024 | 11:00 PM

అనపర్తి టికెట్ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari)తో చర్చించినట్లు అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallimilli Rama Krishna Reddy) తెలిపారు. శనివారం నాడు దగ్గుబాటి పురందేశ్వరి - వెంకటేశ్వరరావు దంపతులతో సమావేశం అయినట్లు తెలిపారు.

రాజమండ్రి: అనపర్తి టికెట్ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి( Purandeswari)తో చర్చించినట్లు అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallimilli Rama Krishna Reddy) తెలిపారు. శనివారం నాడు దగ్గుబాటి పురందేశ్వరి - వెంకటేశ్వరరావు దంపతులతో సమావేశం అయినట్లు తెలిపారు. అనపర్తిలో తాము చేస్తున్న ఆందోళనలను కూటమి నాయకులు చంటీడీనీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిలకు వివరించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు. కేంద్ర బీజేపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారన్నారు.

అనపర్తి బదులు వేరే స్థానం బీజేపీకి ఇవ్వాలనే ప్రతిపాదనలపై చర్చించారని చెప్పారు. సానుకూల నిర్ణయం ఈరోజు రాత్రికి గాని రేపు ఉదయానికి గాని వచ్చే అవకాశం ఉందన్నారు. తనకు టిక్కెట్ వస్తోందని ఖచ్చితంగా చంద్రబాబు చెప్పారని అన్నారు. అనపర్తి టికెట్‌ను టీడీపీకి ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. వైసీపీ ఆరాచకం నుంచి టీడీపీ కార్యకర్తలను, ప్రజలను కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం ద్వారా ఎనిమిది గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశానని తెలిపారు. కూటమి ఈ టికెట్‌పై పునరాలోచన చేస్తోందన్నారు. టీడీపీ టికెట్ తనకే వస్తోందని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఇప్పుడు తనకు సానుకూలంగా సంకేతాలు వస్తున్నాయని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:00 PM

Advertising
Advertising