AP Politics: జగన్ జలగ.. ఇసుకతో అప్పనంగా దోపిడీ: లోకేష్ విసుర్లు
ABN, Publish Date - Feb 18 , 2024 | 01:34 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ఒక కటింగ్, ఫిటింగ్ మాస్టర్ అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ అని విరుచుకుపడ్డారు.
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ఒక కటింగ్, ఫిటింగ్ మాస్టర్ అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ అని విరుచుకుపడ్డారు. రెండు నెలల్లో టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేష్ మాట్లాడారు. నారా లోకేష్ ఏమన్నారంటే..?
నారా లోకేష్ కామెంట్స్
‘గత ఏడు రోజులుగా ఉత్తరాంధ్రతో పర్యటిస్తున్నాను. ఇక్కడి యువత గర్జిస్తుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖ ఉండేది. ఇప్పుడు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి సరఫరా చేస్తున్నాడు. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నాడు. విశాఖను విషాద పట్నంగా సీఎం జగన్ మార్చారు. విశాఖలో రోజుకో మర్డర్, రోజుకో భూ కబ్జా జరుగుతున్నాయి. మీ కుటుంబాన్ని ఎవరు కిడ్నాప్ చేశారని ఎంపీని అడగండి. ఎమ్మార్వో రమణయ్యని కిరాతకంగా చంపారు. ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడికి జగన్ వెళ్తాడు. జగన్ అర్జునుడు కాదు భస్మాసురుడు. లక్ష కోట్ల ఆస్తి, లక్ష రూపాయలు చెప్పులు, వెయ్యి రూపాయలు నీళ్ళు తాగే జగన్ పెత్తందారుడు. జగన్ జలగ లాంటి వాడు. ఇసుక ద్వారా రోజు 3 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్లు పైగా సంపాదిస్తున్నాడు. గూగుల్‌లో 6093 అని కొడితే జగన్ ఫొటో వస్తుంది. పేద విద్యార్థులు అంటే జగన్‌కు చిన్న చూపు. జగన్ పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుతారు. గాలిపై కూడా పన్ను వేస్తాడెమో. మూడు రాజధానులు పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్నాడు. 500 కోట్లతో ఋషి కొండను నిర్మిస్తున్నాడు. పంచగ్రామాల సమస్య పరిష్కరించే బాధ్యత మేమే తీసుకుంటాం. టి.డి.ఆర్ పేరుతో మధురవాడలో కోట్లు కుంభకోణం చేశారు.
భయం నా బయోడేటాలో లేదు. భయ పడకుండా పాదయాత్ర చేశా. జగన్ మాదిరిగా పరదాలు మాటున తిరగలేదు. టీడీపీ జనసేన కలిసి పోరాడాలి. టీడీపీ జనసేన మధ్య పేటీఎం బ్యాచ్ చిచ్చు పెడుతుంది. ఐదేళ్లలో సీఎం జగన్ 100 పథకాలు కట్ చేశారు. రైతులకు అండగా ఉండటానికి రూ.25 వేల ఆర్థిక సాయం చేస్తాం. చంద్రబాబు పాలనలో నెలకో కంపెనీ వస్తే.. జగన్ తరిమివేశారు. 60 లక్షల మంది అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లను తనకు అన్నా ఎన్టీఆర్ ఇచ్చారు. మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని కాపాడతాను. తనపై కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. 2019కి ముందు ఒక్క కేసు లేదు. వైసీపీ నేతలు, అధికారులను వదలను. అందరి పేర్లు ఎర్ర బుక్‌లో రాసి ఉన్నాయి. ఎర్ర బుక్‌పై కేసు పెడతారాట.
దొంగ కేసు పెట్టి, 53 రోజులు చంద్రబాబును జైలులో ఉంచారు. తన జోలికొస్తే తోలు తీస్తా. విశాఖ ఈస్ట్‌లో ఉన్నా, అరెస్ట్ చేయు. ధైర్యంతో పాదయాత్ర చేశా. చంద్రబాబు అరెస్టైన సమయంలో తనకు ఫోన్ చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. సంఘీభావం తెలిపేందుకు రాకుండా అడ్డుకున్నారు. సైకో జగన్‌ను తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. పసుపు సైన్యం, జన సైనికులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది అని’ నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి పై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని నారా లోకేశ్ అభిప్రాయ పడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 18 , 2024 | 01:58 PM