ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: నెల్లూరులో అక్రమాలపై మాజీ మంత్రి సీరియస్.. అధికారుల చర్యలేవి అంటూ ప్రశ్న

ABN, Publish Date - Mar 21 , 2024 | 02:02 PM

Andhrapradesh: జిల్లాలో అక్రమ క్వార్ట్జ్, ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వీటికి సంబంధించిన ఆధారాలను మాజీ మంత్రి మీడియా ముందు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో యధేచ్ఛగా వేల కోట్ల క్వార్ట్జ్, ఇసుక, గ్రావెల్ దోచేస్తున్నారని.. అక్రమార్కులకు అధికారులు కొమ్ము కాయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

నెల్లూరు, మార్చి 21: జిల్లాలో అక్రమ క్వార్ట్జ్, ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Former Minister Somireddy Chandramohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వీటికి సంబంధించిన ఆధారాలను మాజీ మంత్రి మీడియా ముందు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో యధేచ్ఛగా వేల కోట్ల క్వార్ట్జ్, ఇసుక, గ్రావెల్ దోచేస్తున్నారని.. అక్రమార్కులకు అధికారులు కొమ్ము కాయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వరదాయపాళెంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టించామన్నారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలున్నాయిని.. ఎవరి మీద కేసులు పెట్టారని ప్రశ్నించారు. కోడ్ వచ్చాక కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు వెంటనే వెళ్లరట? మైనింగ్ అధికారి వెళ్లి చూసొస్తారట! అంటూ ఎద్దేవా చేశారు. జీతాలు తీసుకుంటామని... మంత్రి, ఎమ్మెల్యేల కాళ్లు వత్తుతామంటున్నారని.. యాక్షన్ మాత్రం తీసుకోరని మండిపడ్డారు.

Ambati Rambabu: సత్తెనపల్లిలో మంత్రి అంబటికి షాక్

మంత్రి కాకాణి సొంత మండలంలో అయిదేళ్లుగా భారీ అక్రమ మైనింగ్ జరుగుతుంటే చర్యలు తీసుకోరా? అని నిలదీశారు. కలెక్టర్ ఏం యాక్షన్ తీసుకోలేదని.. రూ.వేలకోట్ల అక్రమాల్లో కలెక్టర్, ఎస్పీ భాగస్వామ్యం పెట్టుకున్నారని ఆరోపించారు. వరదాయపాళెంలో రూ.500 కోట్ల క్వార్ట్జ్, మొగళ్లూరులో రూ.400కోట్ల క్వార్ట్జ్, ఇరువూరులో రూ.400కోట్ల అక్రమాలు జరిగాయని.. జిల్లా వ్యాప్తంగా రూ.వేల కోట్ల ప్రజా ధనం దోచుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల అధికారులకు కలెక్టర్, ఎస్పీలపై ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్‌తో విచారణ జరిపిస్తామన్నారు. అక్రమార్కులెవ్వరినీ వదిలే ప్రశక్తి లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అధికారులను ఎప్పుడూ చూడలేదని... ప్రజలకు కలెక్టర్, ఎస్పీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి, అధికారపార్టీ నేతల బూట్లు కింద ఉన్నామని చెప్పాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి..

Chandrababu: 99 శాతం హామీల అమలంటున్న జగన్ మాటలు బూటకం

Ambati Rambabu: సత్తెనపల్లిలో మంత్రి అంబటికి షాక్


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 02:02 PM

Advertising
Advertising