ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nellore: పడమటి నాయకుడుపల్లి, పొంగూరు రిజర్వాయర్‌కు మహర్దశ: మంత్రి ఆనం

ABN, Publish Date - Dec 10 , 2024 | 02:58 PM

గత వైసీపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి పట్టాదారు పాసు పుస్తకాలపై అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలను ముద్రించిందని మంత్రి ఆనం మండిపడ్డారు. నాటి ప్రభుత్వం రైతులను నిలువు దోపిడీ చేసే ప్రయత్నం చేసిందని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల చట్టాన్ని రద్దు చేసి ప్రభుత్వ రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని ఆయన చెప్పారు.

Minister Anam Ramanarayana Reddy

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయం, నీటిపారుదల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత వైసీసీ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని, నీటి ప్రాజెక్టుల పనులు అటకెక్కాయని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని మంత్రి చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టులను వంద శాతం పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిగ రిజర్వాయర్‌ను మంత్రి ఆనం పరిశీలించారు.


ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. " సోమశిల జలాశయానికి అనుసంధారమైన హై లెవెల్ కెనాల్ పనులు 11 సంవత్సరాల తర్వాత ప్రారంభిస్తున్నాం. మెట్టప్రాంత ప్రజల కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పనులు ఆటకెక్కాయి. జలాశయం నుంచి నీరు వృథాగా సముద్రానికి పోతున్నా వైసీపీ పాలకులు చూస్తూ ఉండిపోయారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హైలెవల్ కెనాల్ పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు నీరు అందిస్తాం. పడమటి నాయకుడుపల్లి, పొంగూరు రిజర్వాయర్‌ను 2026 మార్చి నాటికి పనులు పూర్తి చేసి సోమశిల జలాలను అందిస్తాం. ఇప్పటికే భూసేకరణ చేపట్టాం. అధికారుల సమన్వయంతో పనులు చేసేందుకు ముందుకు సాగుతాం. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండల ప్రజల కల ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కెనాల్. వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరిగాయి" అని అన్నారు.


అంతకుముందు మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలోనే జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి పట్టాదారు పాసు పుస్తకాలపై అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలను ముద్రించిందని మంత్రి ఆనం మండిపడ్డారు. నాటి ప్రభుత్వం రైతులను నిలువు దోపిడీ చేసే ప్రయత్నం చేసిందని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల చట్టాన్ని రద్దు చేసి ప్రభుత్వ రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 33 రోజులపాటు జరిగే ఈ రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ప్రజా సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన చెప్పారు. పొంగూరు, నాయుడుపల్లి రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి ఆనం రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి:

AP News: పవన్‍ కళ్యాణ్‍కు బెదిరింపు కాల్స్ కేసులో పురోగతి

Undavalli Arun Kumar: పవన్‌కు ఉండవల్లి సంచలన లేఖ

Updated Date - Dec 10 , 2024 | 03:00 PM