ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Beeda Ravichandra: ఎన్నికల అధికారులను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరిస్తున్నారు: బీద రవిచంద్ర

ABN, Publish Date - May 28 , 2024 | 10:03 PM

ఎన్నికల అధికారులను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆరోపించారు. నియోజకవర్గంలో అధికారులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, మాట వినని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు చెప్పిన విధంగానే అధికారులు నడుచుకుంటున్నారని తాము ఐదేళ్లుగా మెుత్తుకున్నామన్నారు. ఎన్నికలు మొదలయ్యాక కూడా కొంతమంది అధికారుల తీరు మారలేదన్నారు.

Beeda Ravichandra

నెల్లూరు: ఎన్నికల అధికారులను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆరోపించారు. నియోజకవర్గంలో అధికారులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, మాట వినని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు చెప్పిన విధంగానే అధికారులు నడుచుకుంటున్నారని తాము ఐదేళ్లుగా మెుత్తుకున్నామన్నారు. ఎన్నికలు మొదలయ్యాక కూడా కొంతమంది అధికారుల తీరు మారలేదన్నారు. అధికారుల పని తీరు బాగాలేదని కాకాణి ఇప్పుడు మాట్లాడుతున్నారని, తనకు అనుకూలంగా ఉంటే పనితీరు బాగున్నట్లు చెప్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు నెలరోజులు ముందు పార్టీ కార్యక్రమాలకు తెదేపా నేత సోమిరెడ్డి తిరుగుతూ బిరుదవోలు గిరిజనుల పిల్లలకు చెప్పులు కొనుక్కునేందుకు డబ్బులు ఇస్తే దీనిపై మంత్రి కాకాణి ఫిర్యాదు చేశారన్నారు. ఎండలకు చెప్పులు లేకుండా తిరుగుతున్న చిన్నారులకు సహృదయంతో డబ్బులు ఇవ్వడాన్నీ వక్రీకరించారని గుర్తు చేశారు. ఎన్నికల వేళ పొదలకూరు మండలంలో, వరిగొండ, సర్వేపల్లి గ్రామాల్లో వైకాపా నేతలు మద్యం, నగదు విచ్చలవిడిగా పంపిణీ చేశారన్నారు. తెదేపా శ్రేణులపైనా దాడులు చేశారని దీనిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.

ఇవి కూడా చదవండి:

Chandrababu: సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..?

Ap politics: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..

Updated Date - May 28 , 2024 | 10:03 PM

Advertising
Advertising