ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Narayana: ఫించన్ల పంపిణీపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 30 , 2024 | 08:29 PM

ఏపీలో రేపు ఉదయం 6 గంటల నుంచి 65 లక్షల మందికి రూ.7 వేలు చొప్పున పెన్షన్ పంపిణీ జరుగుతుందని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు.

Minister Narayana

నెల్లూరు: ఏపీలో రేపు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుందని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. 65 లక్షల మందికి రూ.7 వేలు చొప్పున పెన్షన్ పంపిణీ జరుగుతుందని చెప్పారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 8 వేల మంది ఉద్యోగులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వివరించారు. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఫించన్ పంపిణీని వివాదాస్పదం చేశారని మండిపడ్డారు.

ఈరోజు (ఆదివారం) అధికారులతో ఫించన్ల పంపిణీపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఫించన్ పంపిణీ కార్యక్రమానికి అధికారులు చూపిన చొరవ అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పటికీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు.


2019కు ముందు డ్రైన్, తాగునీరు ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.250కోట్లు మాత్రమే ప్రాజెక్టుకు ఖర్చు చేసిందని అన్నారు. ఏషియన్ ఇన్‌ఫాస్ట్రక్చర్‌కి రాష్ట్ర షేర్ ఇవ్వకపోవడంతో భాగస్వామ్యాన్ని నిలిపేశారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, వారిని మరో ఆరు నెలలు గడువు కోరామని తెలిపారు.

ఆరు నెలలకు ఇచ్చే 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు రెండు దఫాల నుంచి రాష్ట్రానికి రావట్లేదని చెప్పారు. 15 ఫైనాన్స్‌కి బిల్ సబ్మిట్ చేయకపోవడంతో వాళ్లు నిధుల కేటాయింపు నిలిపివేశారని గుర్తుచేశారు. జగన్ అస్తవ్యస్త పాలన వల్ల రాష్ట్రం ఆర్థికంగా కుదేలైందని విమర్శించారు. జగన్ అప్పులు తెచ్చాడు తప్పించి అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి నారాయణ మండిపడ్డారు.


ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నా ఫించన్లు: ప్రభాకర్ రెడ్డి

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా ఒకటో తేదీన ఫించన్లు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. కానీ నాలుగైదు రోజుల పాటు ఫించన్లు పంపిణీ సాగేదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకున్నా సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రూ.7వేల చొప్పున ఫించన్లు పంపిణీ చేయనున్నారని అన్నారు. రేపే ఫించన్ల పంపిణీ మొత్తం జరిగేలా చర్యలు తీసుకున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 30 , 2024 | 09:41 PM

Advertising
Advertising