ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rave Party: ఆ గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి: సోమిరెడ్డి

ABN, Publish Date - May 21 , 2024 | 01:11 PM

నెల్లూరు: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్ ఉండే కారు, పాస్ పోర్టు చిక్కాయని, తనది కాదని చెబుతున్నారని, ఇక్కడ దొరికిన గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

నెల్లూరు: బెంగళూరు (Banglore) ఎలక్ట్రానిక్ సిటీ (Electronic City) సమీపంలోని ఓ ఫాం హౌస్‌ (Farm House)లో జరిగిన రేవ్ పార్టీ (Rave Party)లో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) స్టికర్ (Sticker) ఉండే కారు (Car), పాస్ పోర్టు (Passport) చిక్కాయని, తనది కాదని చెబుతున్నారని, ఇక్కడ దొరికిన గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి అని టీడీపీ నేత (TDP Leader), మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన ఆయన మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నకిలీ కల్తీ మద్యం కేసు, కోర్టులో ఫైల్స్ మాయమైన కేసులో తప్పు ఒప్పుకో లేదు నువ్వు.. రేవ్ పార్టీలో కూడా నాకు సంబంధం లేదని చెప్పక ఏమి అంటావ్’’ అని మండిపడ్డారు.


రేవ్ పార్టీలో బెంగుళూరు డ్రగ్స్, కోకోయిన్ దొరికాయని, పోలీసులకు పట్టుబడినవారు.. నాటోరియస్ డ్రగ్స్ ముద్దాయిలు, నలుగురు గ్యాంగ్ అని, ఫామ్ హౌస్ గోపాల్ రెడ్డి కాకాణికి మంచి మిత్రుడని సోమిరెడ్డి ఆరోపించారు. రేవ్ పార్టీతో సంబంధం లేనప్పుడు అక్కడ కారు స్టిక్కర్, పాస్ పోర్టు ఎందుకు దొరికాయని ప్రశ్నించారు. నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీలో కాకాణికు సంబంధాలు ఉన్నాయన్నారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అంతరాష్ట్ర ముఠాతో కలిసి ఆయన పని చేశారని, ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. అక్రమ మైనింగ్, శాండ్, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేకం వాటితో కాకాణికి సంబంధాలు ఉన్నాయని, ఆయనపై ఒక పుస్తకం రాయవచ్చునని అన్నారు. సంఘ విద్రోహ శక్తులతో సంబంధం ఉన్నవ్యక్తి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.


కాగా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌‌లో జరిగిన రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు (Vasu) ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ పార్టీకి సుమారు 150 మంది వరకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నాన్ స్టాప్‌గా పార్టీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పార్టీలో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు (Police) తెలిపారు. నిర్వాహకుడు వాసుతోపాటు అరుణ్ (Arun), సిద్దికి (Siddiqui), రన్‌దీర్ (Randhir), రాజ్ భవ్‌ (Raj Bhav)లను పోలీసులు అరెస్టు చేశారు. వాసు బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. సిద్దికి, రన్‌దీర్, రాజ్‌భవ్‌లను డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరు పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)కి చిక్కింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎఫ్ఐఆర్‌లో సెలబ్రిటీల పేర్లు..

వైభవంగా ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు..

. సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 01:14 PM

Advertising
Advertising