ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నోరు తెరిస్తే చాలు పచ్చి అబద్ధాలు..!

ABN, Publish Date - Apr 05 , 2024 | 03:34 AM

ముఖ్యమంత్రి జగన్‌ తన ప్రసంగంలో పలు అబద్ధాలు చోటుచేసుకున్నాయి. పెన్షన్లు తీసుకునేందుకు వెళ్లి 31మంది వృద్ధులు చనిపోయారని, వారి మరణానికి చంద్రబాబే కారణమని నాయుడుపేట బహిరంగసభలో జగన్‌ ఆరోపించారు.

YS Jagan

  • వృద్ధుల మరణాలకు బాబే కారణమట!

  • ఇంటివద్దే పెన్షన్లు ఇచ్చే వీలున్నా ఎండల్లో సచివాలయాల చుట్టూ తిప్పుతోంది జగన్‌

  • బాబు వెయ్యి ఇస్తే తాను 3వేలు చేశారట!

  • రూ.200 పెన్షన్‌ను 2000కు పెంచింది బాబు

  • మేనిఫెస్టోను వందశాతం అమలుచేశారట

  • సీపీఎస్‌ రద్దు, దశలవారీ మద్యనిషేధంపై మడత

Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan) తన ప్రసంగంలో పలు అబద్ధాలు చోటుచేసుకున్నాయి. పెన్షన్లు తీసుకునేందుకు వెళ్లి 31మంది వృద్ధులు చనిపోయారని, వారి మరణానికి చంద్రబాబే(Chandrababu) కారణమని నాయుడుపేట బహిరంగసభలో జగన్‌ ఆరోపించారు. సచివాలయాలకు రాలేని వృద్ధులు, వికలాంగులు,అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇళ్ల వద్దే పెన్షన్లు అందజేసే వీలున్నా ప్రభుత్వం అలా చేయడం లేదు. చంద్రబాబుపై నెపం వేయడానికి పెన్షనర్లను ఇబ్బంది పెడుతూ సభలో మాత్రం చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ల కింద రూ. వెయ్యి ఇస్తుంటే తాను అధికారంలోకి రాగానే దశలవారీగా రూ.మూడువేలు చేశానని జగన్‌ మరో అబద్ధం చెప్పారు. వాస్తవానికి చంద్రబాబు సీఎం అయ్యేనాటికి సామాజిక భద్రతా పెన్షన్‌ కేవలం రూ.200. దాన్ని చంద్రబాబు తొలుత రూ.వెయ్యి చేసి.. ఆ తర్వాత రూ. 2 వేలకు పెంచారు. అమలు చేసేవి మాత్రమే ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంటానని, మేనిఫెస్టో హామీలు వందశాతం నెరవేర్చానని మరో అబద్ధపు బాంబు పేల్చారు. నిజానికి జగన్‌ మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో నెరవేర్చని హామీలే అధికం. ఉదాహరణకు అధికారంలోకి వచ్చిన వారంరోజులకే సీపీఎస్‌ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లు పూర్తవుతున్నా సీపీఎస్‌ రద్దు కాలేదు. అధికారంలోకి రాగానే ఏడాదికి కొంత శాతం చొప్పున మద్యం దుకాణాలు రద్దు చేసి చివరి ఏడాది మద్యపాన నిషేధం విధించాకే ఓట్లు అడుగుతానని మేనిఫెస్టోలో చెప్పారు. మద్యపాన నిషేధం విధించకుండానే ఎన్నికల ప్రచారంలోకి దిగారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 08:41 AM

Advertising
Advertising