Bonda Uma: తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ..
ABN, Publish Date - Mar 20 , 2024 | 01:34 PM
ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
అమరావతి: ఏపీ పోలీస్ (AP Police) ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)కు పాల్పడుతున్నారని టీడీపీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Uma) తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఈసీ (EC) ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతోందన్నారు.
AP Politics: రెచ్చిపోయిన ఎమ్మెల్యే.. కారు ఆపి మరీ వారిపై
డబ్బు, మద్యం అక్రమ రవాణా రిశాంత్ రెడ్డి అనే అధికారి చూస్తున్నారని బోండా ఉమ తెలిపారు. పోలీస్ అధికారి కొల్లి రఘురామ రెడ్డి లక్ష్యం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గతంలోనే అమరనాథ్ రెడ్డి , పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి ధ్రువీకరించారని బోండా ఉమ తెలిపారు. ఐపీఎస్ రూల్స్ కి బదులు వైఎస్సార్‌సీపీ రూల్స్‌ని కొందరు అధికారులు అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వీరిని వెంటనే తొలగించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.
CBN Vs Jagan: వైసీపీ నేతల్లో ఫుల్ టెన్షన్.. ఎందుకంటే..?
Updated Date - Mar 20 , 2024 | 01:34 PM