Chevireddy:మరీ ఇంత దిగజారిపోతారా.. బాలినేనికి చెవిరెడ్డి చురకలు
ABN, Publish Date - Nov 25 , 2024 | 09:02 PM
కొండేపి నుంచి ఒంగోలుకు వచ్చి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోటీ చేశారని వైసీపీ సీనియర్ నేత చెవి రెడ్డి భాస్కర్ రెడ్ ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హనానికి ఇలా మాట్లాడటం బాలినేనికి తగదని చెవిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తిరుపతి: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వైసీపీ సీనియర్ నేత చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అదానీతో చారిత్రిక ఒప్పందం తాను మంత్రిగా ఉన్నపుడు జరిగిందని బాలినేని గొప్పగా చెప్పుకోవాలని అన్నారు. ఫైల్ వస్తే ఇష్టం లేదంటే ఇష్టం లేదని రాయాలని కానీ. ఫార్వర్డ్ చేశారు అంటే అంగీకరించినట్లేనని చెప్పారు. ఫైల్లో రెండు సార్లు సంతకం చేసి ఎవరో గుర్తింపు కోసం అక్కడ ఎదగాలనే స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హనానికి ఇలా మాట్లాడటం తగదని అన్నారు. ప్రత్యేక విమానంలో రష్యాకు, అవతల పార్టీ వారిని తీసుకుపోయేంత స్వేచ్ఛను జగన్ అన్న ఇచ్చారని అన్నారు. అదే పని ఇప్పుడున్న మంత్రిని చేయమనాలని, 24 గంటల్లో పదవి ఊడిపోతుందని చెప్పారు.
‘‘వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతున్నారు.. మీకూ ఇద్దరు అక్కచెల్లెళ్లున్నారు. వారిని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకురాలేదు? వారిని ఎందుకు ఆస్తుల్లో భాగస్వాములు చేయలేదు. అధికారంలో ఉన్నపుడు మంత్రివర్గంలో జరిగిన అంశాలను లీక్ చేసినా మన వాసన్నా అనే అందరూ భావించారు. ఎన్ని రకాలుగా బ్లాక్ మెయిల్ చేసినా భరించారు. భరిస్తున్నారు. ఏదో ఒక రోజు తప్పు చేశామనే భావన మీకు వస్తుంది. కొండేపి నుంచి ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ చేశారు. ఎంతో మంది సొంత జిల్లా నుంచి వేరే జిల్లాల్లో పోటీ చేస్తున్నారు. అలాంటపుడు నేను జగన్ ఆదేశంతో నేను వెళ్లిపోటీ చేశాను. ఒంగోలు అసెంబ్లీ పరిధిలో మీ కంటే నాకు నాలుగువేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ప్రజలు నన్ను అంగీకరించారు. ఆ అనుబంధం ఒంగోలు ప్రజలతో ఎప్పటికీ అలాగే ఉంటుంది’’ అని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.
చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన విమర్శలు
కాగా.. అంతకుముందు.. వైసీపీ నేత చెవి రెడ్డి భాస్కర్ రెడ్డికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ స్థాయి ఏందీ అని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా ఒంగోలు జిల్లాల్లో ఆర్టీసీ సైట్లను తీసుకున్నవా లేదా అని నిలదీశారు. ఇవాళ(సోమవారం) ఏబీఎన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా పని చేస్తూ కందుకూరు, సంత నూతల పాడు నియోజకవర్గాల్లో చెవిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు బయటకు తీయమంటావా అని ప్రశ్నించారు. చెవిరెడ్డిది చిత్తూరు జిల్లా అయ్యి ఉండి కూడా ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అండతో చేసిన బాగోతాలు ప్రజలకు తెలుసునని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదని.. విజయమ్మ , షర్మిల కూడా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించారు.
వాళ్ల కుటుంబానికి తాను ఎప్పుడు విధేయుడినేనని చెప్పారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతల్లో ఏ ఒక్కరికి లేదని అన్నారు. సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీలో తాను మంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్లో నిర్ణయం కోసం అర్ధరాత్రి ఫైల్ పంపి సైన్ చేయమన్నారని చెప్పారు. కేవలం మంత్రి వర్గం చర్చ కోసం అనుకోని సైన్ చేశానని చెప్పారు. ఎవరు ఎవరి మెప్పు కోసం పని చేస్తారో అందరికీ తెలుసునని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
విద్యుత్ ఒప్పందాల్లో ఆరోపణలు...
విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయ స్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను నాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఏపీ విద్యుత్ శాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP NEWS:అదానీ స్కాంలో.. జగన్‌పై గోనే ప్రకాశరావు సంచలన ఆరోపణలు
Kollu Ravindra: వైసీపీలో వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు... మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
Read Latest AP News and Telugu News
Updated Date - Nov 25 , 2024 | 09:13 PM