ప్రతిభకు ప్రోత్సాహం ఇచ్చే సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 04 , 2024 | 12:18 AM
ద్యార్థుల్లోని ప్ర తిభకు ప్రోత్సాహాం ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడని ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ పే ర్కొన్నారు. బుధవారం సంతనూతలపాడులోని జ డ్పీహైస్కూల్లో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్ర మానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఎమ్మెల్యే బీఎన్
సంతనూతలపాడు, జూలై 3: విద్యార్థుల్లోని ప్ర తిభకు ప్రోత్సాహాం ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడని ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ పే ర్కొన్నారు. బుధవారం సంతనూతలపాడులోని జ డ్పీహైస్కూల్లో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్ర మానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎన్ మాట్లాడుతూ నా డు ఉమ్మడి రాష్ర్టానికి చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు విద్యార్థులకు అన్నివిధాలుగా తో డుండి వారిలో ఎక్కువమందిని సాఫ్ట్‌వేర్ రంగం వైపు వెళ్లేవిధంగా చేసి వారికి జీవితంలో భరోసా ఇచ్చిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాష్ట్రంలో ఏ విద్యా ర్థి కూడా చదువులో వెనుకపడకూడదని, దేశానికి నేటి విద్యార్థులే రేపటి పునాదులు వంటివారన్నా రు. గత 20 ఏళ్ల క్రితం చూసిన చంద్రబాబును ఇ ప్పుడు అందరం చూడబోతున్నామని పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు అన్ని వర్గాలవారికి, అన్ని రం గాల్లోను సముచితస్ధానం దక్కేలా ముఖ్యమంత్రి వద్ద ప్రణాళికలు ఉన్నాయన్నారు. అందువలన విద్యార్థులు తమ దృష్టి అంతా చదువుపై ఉంచితే మీ భవిష్యత్తు ముఖ్యమంత్రి చూసుకుంటారని ఎ మ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో వెంక టరెడ్డి, హెచ్‌ఎం ఉమాదేవి, టీడీపీ మండలాధ్య క్షుడు మద్దినేని హరిబాబు, నాయకులు ఉపాధ్యా యులు పాల్గొన్నారు.