కనిగిరి కరాటే విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Feb 05 , 2024 | 11:30 PM
విశాఖపట్నం రాజీవ్‌గాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో ఈనెల 3, 4 తేదీల్లో ఏడవ అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షి్‌ప పో టీలు జరిగాయి. ఈ పోటీల్లో కనిగిరికి చెందిన కరాటే డో స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ప్రతిభ కనపరచి బంగారు, రజిత పతకాలు సాధించినట్లు అకాడమీ మాస్టర్ యాసిన్ ఆదివారం తెలిపారు.
హీరో సుమన్ ద్వారా పతకాలను అందుకున్న విజేతలు
కనిగిరి, ఫిభ్రవరి 5 : విశాఖపట్నం రాజీవ్‌గాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో ఈనెల 3, 4 తేదీల్లో ఏడవ అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షి్‌ప పో టీలు జరిగాయి. ఈ పోటీల్లో కనిగిరికి చెందిన కరాటే డో స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ప్రతిభ కనపరచి బంగారు, రజిత పతకాలు సాధించినట్లు అకాడమీ మాస్టర్ యాసిన్ ఆదివారం తెలిపారు. పోటీల్లో క్రీడాకారులు బాల బాలికల ఫైట్, కటాస్ విభాగంలో అండర్ - 11 కటాస్ విభాగంలో షేక్ అప్రుద్దీన్, ఫైట్ విభాగంలో ఆర్.హర్షవర్దన్‌రెడ్డి బంగారు పతకాలు సాధించారు. అండర్ - 12 కటాస్, ఫైట్ విభాగంలో బీవీఎన్ హేమంత్ సాయి రెండు రజత పతకాలు, అండర్ - 13 కటాస్ విభాంగంలో పీ వెంకటరాజేశ్వరి బంగారు పతకం, కటాస్ విభాగంలో ఏ శశిరారెడ్డి రజత పతకంతో పాటు ఫైట్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. అండర్ - 14 విభాగంలో టీ విష్ణు బంగారు పతకం, కటాస్ విభాగంలో ఆర్ జ్ఞానదీక్ష రజత పతకం, కాంస్య పతకం సాధించగా, కే మానస ఫైట్, కటాస్ విభాగంలో రజత, కాంస్య పతకాలు సా ధించింది. అండర్ - 15 విభాగంలో పీ రాజ్యలక్ష్మీ కటాస్ విభాగంలో కాంస్య పతకం, యోగేశ్వర ఆనంద్ రజత పతకాలు సాధించారు. ప్ర ముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా క్రీడాకారులకు పతకాలు అందుకున్నారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్లు షేక్ అబ్దుల్ వహీద్, షేక్ సుల్తాన్‌బాషాలను అభినందించి బెస్ట్ టీం ట్రోఫీని అందించినట్లు అకాడమీ మాస్టర్ తెలిపారు.