ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Coastal Andhra : కోస్తాలో ముసురు

ABN, Publish Date - Dec 25 , 2024 | 03:58 AM

బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.

  • స్థిరంగా తీవ్ర అల్పపీడనం

  • నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే క్రమంలో బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొంది. నెల్లూరు జిల్లా కావలి, ఆత్మకూరు, అల్లూరి జిల్లా చింతపల్లి, పాడేరు, విజయనగరం జిల్లా బొబ్బిలిలో భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలుచోట్ల వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Dec 25 , 2024 | 03:58 AM