ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: క్రోసూరు టీడీపీ ఆఫీస్‌‌ దగ్ధంపై చంద్రబాబు రియాక్షన్ ఇదీ...

ABN, Publish Date - Apr 08 , 2024 | 03:45 PM

Andhrapradesh: పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయం దగ్ధంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ రౌడీ మూకలే టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. అధికారాన్ని కోల్పోవడం ఖాయం అని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదని.. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Chief Chandrababu naidu

అమరావతి, ఏప్రిల్ 8: పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయం దగ్ధంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) స్పందించారు. వైసీపీ (YSRCP) రౌడీ మూకలే టీడీపీ (TDP) కార్యాలయానికి నిప్పు పెట్టారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. అధికారాన్ని కోల్పోవడం ఖాయం అని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదని.. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన జన స్పందన చూసి ఓర్వలేక ఈ పని చేశారని ఆరోపించారు. రౌడీయిజం, విధ్వంసం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం... ఇదే వైసీపీ వాళ్ల నైజమన్నారు. ప్రజలంతా ఏకమై రాజకీయాల నుంచి వైసీపీ రౌడీలను తరిమి కొట్టాలని కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.


అసలేం జరిగిందంటే..

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని క్రోసూరులో ఉన్న టీడీపీ కార్యాలయానికి అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఆఫీస్‌ ముందు ఏర్పాటు చేసి తాటాకు పందిరికి నిప్పు పెట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. కాగా కొద్ది రోజుల క్రితమే కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్... మన్నెం భూషయ్య కాంప్లెక్స్‌లో పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. అయితే క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన జన స్పందన చూసి ఓర్వలేక వైసీపీ రౌడీమూకలు ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు.


ఇవి కూడా చదవండి...

Janasena: రాజకీయ కుట్రలో భాగంగా జనసేనను నాశనం చేశారు: పోతిన మహేశ్

Breaking News: సీఎం రేవంత్‌ కాన్వాయ్‌లో.. ఒక్కసారిగా పేలిన కారు టైర్!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 03:50 PM

Advertising
Advertising