TDP: వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్
ABN, Publish Date - Apr 01 , 2024 | 04:09 PM
Andhrapradesh: వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో వలంటీర్ల నిజస్వరూపం బయట పడిందన్నారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వెళుతున్నారని.. వలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదన్నారు. కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వలంటీర్లను దూరం పెట్టిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కూడా వలంటీర్లను కొనసాగిస్తామన్నారే గానీ తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. కేవలం సీఎం జగన్ రాజకీయంగా వాలంటీర్లను వాడుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నారని విమర్శించారు.
కృష్ణా జిల్లా, ఏప్రిల్ 1: వలంటీర్ల (Volunteers) మూకుమ్మడి రాజీనామాలపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర (TDP Leader Kollu Ravindra) సంచలన వ్యాఖ్యలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో వలంటీర్ల నిజస్వరూపం బయట పడిందన్నారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వెళుతున్నారని.. వలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదన్నారు. కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వలంటీర్లను దూరం పెట్టిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కూడా వలంటీర్లను కొనసాగిస్తామన్నారే గానీ తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. కేవలం సీఎం జగన్ (CM Jagan) రాజకీయంగా వాలంటీర్లను వాడుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నారని విమర్శించారు. రాజీనామాలు చేయాలని స్థానిక వైసీపీ నేతలు వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చారన్నారు. ప్రత్యేక ఫార్మెట్ తయారు చేసి ఆ ఫార్మెట్ ప్రకారం రాజీనామాలు చేయిస్తున్నారన్నారు. వలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దని అధికారులను కోరుతున్నామన్నారు. ఈసీ కూడా దీనిపై దృష్టి పెట్టి మూకుమ్మడి రాజీనామాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కొల్లు రవీంద్ర కోరారు.
Chandrababu: వలంటీర్లపై మరోసారి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కాగా.. మచిలీపట్నంలో వలంటీర్ల మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను ఈసీ దూరం పెట్టింది. దీంతో మున్సిపల్ కమిషనర్‌కు.. అలాగే గ్రామ సచివాలయాల్లోనూ వలంటీర్లు రాజీనామాలను అందిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 1200 పైబడి వలంటీర్లు సేవలందిస్తున్నారు. ఇక రాజీనామా లేఖలో వలంటీర్లు పేర్కొన్న అంశాలు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులకు అందిస్తూ గత 50 నెలలుగా నిస్వార్ధ సేవలందిస్తున్నామన్నారు. ఎటువంటి రాజకీయాలకూ ప్రభావితం కాకుండా సేవలందిస్తున్నామని తెలిపారు. కొంతమంది తమ సేవలకు రాజకీయాలు ఆపాదించి తమపై ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు. దీనికి తామంతా మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నామని వలంటీర్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
IPL 2024: ముంబైతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్.. ఆ రికార్డు సాధించిన బౌలర్‌గా..
Airtel vs Jio: 60 రోజులకి 90 జీబీ డేటా ప్లాన్‌కి.. ఎయిర్‌టెల్ బెటరా.. లేదా జియోనా
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Apr 01 , 2024 | 04:14 PM