ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara lokesh: గట్లుంటది మనోళ్లతోటి!!.. విహారి వ్యహారంపై లోకేష్..

ABN, Publish Date - Feb 27 , 2024 | 01:52 PM

Andhrapradesh: భారత క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారి వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అంతర్జాతీయస్థాయి క్రికెటర్ కన్నా... వైసీపీ వీధినేత పంతమే మిన్న...!’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 27: భారత క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారి (Andhra Ranji team former captain Hanuma Vihari) వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అంతర్జాతీయస్థాయి క్రికెటర్ కన్నా... వైసీపీ వీధినేత పంతమే మిన్న...!’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) జమానాలో ఆడుదాం ఆంధ్రా అంటే ఏమో అనుకున్నానని.. క్రీడాకారుల జీవితాలతో చెలగాటమాడటం అని కొత్తగా తెలిసిందని యెద్దావా చేశారు. జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న తిరుపతి వైసీపీ కార్పొరేటర్ పుత్రరత్నాన్ని పద్ధతి మార్చుకోవాలని మందలించడమే ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి చేసిన మహాపరాధమన్నారు. భారత్ తరపున 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, ఆంధ్రా రంజీ జట్టుకు ఏడేళ్లు ఏకధాటి కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం వైసీపీ వీధి నాయకుడి పంతం ముందు దిగదుడుపే అన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు శరత్ చంద్రారెడ్డిని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించినప్పుడే ఏసీఏ పరువు బంగాళాఖాతంలో కలిసిపోయిందని వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్లను తలదన్నే వైసిపి విధ్వంసకపాలనలో ఇప్పటి వరకు పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడం చూశామన్నారు. ఇప్పుడు అంబటి రాయుడు, హనుమ విహారి వంటి కొమ్ములు తిరిగిన క్రీడాకారులు కూడా పారిపోతున్నారన్నారు. వైసీపీ నాయకులకు తిక్కరేగిందంటే అంతర్జాతీయస్థాయి క్రికెటర్ అయినా ఇంటికి పోవాల్సిందే... గట్లుంటది మనోళ్లతోటి!! అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 27 , 2024 | 01:53 PM

Advertising
Advertising