ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: ఏ1, ఏ2 చర్యలతో ఆరోగ్య శాఖ నిర్వీర్యం.. జగన్, రజినిపై టీడీపీ నేత ఆగ్రహం

ABN, Publish Date - Apr 10 , 2024 | 04:51 PM

Andhrapradesh: పేదల బతుకులతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, మంత్రి విడదల రజని చెలగాటం ఆడుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ1, ఏ2 చర్యలతో ఆరోగ్య శాఖ నిర్వీర్యమైందని విమర్శించారు. వైసీపీ పాలనలో గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణమన్నారు. అంబులెన్స్ కొనుగోళ్ల పేరుతో రూ.307 కోట్లు విజయసాయి రెడ్డి అల్లుడికి జగన్ కట్టబెట్టారని ఆరోపించారు.

అమరావతి, ఏప్రిల్ 10: పేదల బతుకులతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan Mohan Reddy), మంత్రి విడదల రజిని (Minister Vidala Rajini) చెలగాటం ఆడుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ1, ఏ2 చర్యలతో ఆరోగ్య శాఖ నిర్వీర్యమైందని విమర్శించారు. వైసీపీ పాలనలో గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణమన్నారు. అంబులెన్స్ కొనుగోళ్ల పేరుతో రూ.307 కోట్లు విజయసాయి రెడ్డి (MP Vijayasaireddy) అల్లుడికి జగన్ కట్టబెట్టారని ఆరోపించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని.. తన వర్గానికి మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారని వ్యాఖ్యలు చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు బోర్డులు తిప్పేశారన్నారు. అంకెల గారెడితో నా ఎస్సీ, నా బీసీలంటూ ప్రజలను జగన్ మోసగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..


వైసీపీ పాలనలో ఆసుపత్రుల్లో మందులు లేవని, వైద్యులు కరవని చెప్పుకొచ్చారు. వైద్య రంగం మూల సూత్రంతో టీడీపీ పని చేసిందన్నారు. 33 పథకాలతో పేదల ఆరోగ్యానికి చంద్రబాబు విశేష కృషి చేశారని చెప్పుకొచ్చారు. కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే అని అన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవా విధానంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించామన్నారు. తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వంటి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనే అని గుర్తుచేశారు. ప్రజల ఆరోగ్యానికి కేటాయించిన డబ్బులను ఏ1 జగన్, ఏ2 రజిని పక్కదారి మళ్లించారని దుయ్యబట్టారు. పేదల ఆరోగ్యంతో జగన్ ఆటలు ఆడుతున్నారన్నారు. సామాన్య ప్రజల ఆక్రోశంలో జగన్ కొట్టుకుపోవడం ఖాయమని వేమూరి ఆనంద్ సూర్య స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Char Dham Yatra: బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి ధామ్ దర్శన తేదీలు ఖరారు..!

Viral Video: వీళ్లకు మానవత్వం ఉందా? బాలుడిపై కుక్క దాడి చేస్తుంటే చుట్టూ ఉన్న వారు ఏం చేశారో చూడండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 10 , 2024 | 04:51 PM

Advertising
Advertising