Buddha Venkanna : పేర్ని నానీని ఉరితీయాలి
ABN, Publish Date - Dec 23 , 2024 | 04:04 AM
పేదల బియ్యాన్ని పందికొక్కులా తిన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానీని ఉరి తీయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
పేదల బియ్యాన్ని పందికొక్కులా తిన్నాడు: బుద్దా వెంకన్న
విజయవాడ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పేదల బియ్యాన్ని పందికొక్కులా తిన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానీని ఉరి తీయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేర్ని నాని 187 టన్నుల బియ్యాన్ని విక్రయించిందే కాకుండా, తూకపు యంత్రంలో తేడా ఉందేమో, నష్టం తాను ఇస్తానంటూ కలరింగ్ ఇచ్చాడని విమర్శించారు. పేదలకు ఇచ్చే బియ్యం తినేసి, రూ.1.70 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాడో తేలాలన్నారు. బియ్యం గోడౌన్.. పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉందని, అధికారులు తనిఖీకి రాగానే ఆయన పారిపోయాడని, కొడుకు కిట్టూ ఏమయ్యాడో తెలియదని అన్నారు. ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. 1999లో పేర్ని నాని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తికి, 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్‌కు తేడా ఉందని, ఆ లెక్క తేలాల్సి ఉందన్నారు. గోడౌన్లను ప్రభుత్వానికే అద్దెకిచ్చి, ప్రభుత్వ బియ్యాన్నే కాజేయడం దుర్మార్గమని అన్నారు. తప్పు చేసిన వారికి త్వరలోనే శిక్ష పడాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వంశీ, నానీల అవినీతిని కూడా బయటపెడతామని అన్నారు.
Updated Date - Dec 23 , 2024 | 04:06 AM