ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు విసిరిన ఆకతాయిలు

ABN, Publish Date - Apr 14 , 2024 | 07:49 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు చంద్రబాబుపై రాళ్లు విసిరారు.

విశాఖపట్నం: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు చంద్రబాబుపై రాళ్లు విసిరారు.


TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి

ఈ రాళ్లు సభలో ఎవరికి తగలలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాగా రాయి విసిరిన వ్యక్తి ఎవరు? ఈ దాడి వెనుక గల కారణాలేంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏపీ సీఎం జగన్‌పై రాయితో దాడి జరిగిన మరుసటి రోజే చంద్రబాబుపై అలాంటి దాడే జరిగింది. అక్కడున్న తెలుగు తమ్ముళ్లు రాయి విసిరిన ఆకతాయిలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల వైఫల్యంతోనే ఈఘటన జరిగిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


AP Election 2024: సీఎంపై రాయి విసిరిన కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఏం కేసు పెట్టారంటే?

కాగా.. నిన్న విజయవాడలో సీఎం జగన్, ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై రాళ్లు విసరడంతో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే గాజువాకలో చంద్రబాబు ప్రసంగం కొనసాగుతునే ఉంది. నిన్న చీకటిలో గులక రాయి వేశారని .. ఇప్పుడు వెలుగులో తనపై రాళ్లు వేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాళ్ల దాడి చేస్తోంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.


రాళ్లు వేసింది జే గ్యాంగ్ పనేనని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ సహకారంతోనే విశాఖ పోర్టుకు డ్రగ్స్ దిగుమతి అయ్యాయని మండిపడ్డారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాలో జగన్ ప్రభుత్వమే దోషి అని విరుచుకుపడ్డారు. డ్రగ్స్ నివారించమని అడిగితే టీడీపీ ఆఫీసుపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

Elections 2024: కుంభకర్ణుడిలా ఎన్నికల సమయంలో నిద్ర లేచారు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..

TDP: జగన్ ఓడి.. చంద్రబాబు సీఎం అవుతారు: రఘురామ

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 14 , 2024 | 08:11 PM

Advertising
Advertising