Andhra Pradesh: అంబటిని చంపేస్తామంటూ బెదిరింపులు.. వాళ్లపనేనంటున్న రాయుడు ఫ్యాన్స్..
ABN , Publish Date - May 30 , 2024 | 12:55 PM
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడి (Ambati Rayudu) ని చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి రాయుడును అసభ్యపదజాలంతో తిడుతూ చంపేస్తామని.. కుటుంబ సభ్యులను రేప్ చేస్తామంటూ బెదిరించారని అంబటి రాయుడు స్నేహితుడు సామ్పాల్ తెలిపారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడి (Ambati Rayudu) ని చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి రాయుడును అసభ్యపదజాలంతో తిడుతూ చంపేస్తామని.. కుటుంబ సభ్యులను రేప్ చేస్తామంటూ బెదిరించారని అంబటి రాయుడు స్నేహితుడు సామ్పాల్ తెలిపారు.
ఐపీఎల్ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా కోహ్లీపై రాయుడు చేసిన వ్యాఖ్యలతోనే విరాట్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా ఈ బెదిరింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అంబటి రాయుడు స్నేహితుడు సామ్ పాల్ బెదిరింపులకు సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టాడు. తాను రాయుడు కుటుంబంతో కలిసి డిన్నర్ కోసం బయటకు వెళ్లామని.. ఆ సమయంలో బెదిరింపులకు సంబంధించిన విషయాన్ని రాయుడు భార్య తనతో చెబుతూ బాధపడిన విషయాన్ని సామ్పాల్ తెలిపారు. రాయుడు నేరుగా ఈ అంశంపై స్పందించకపోయినప్పటికీ.. ఫ్యామిలీ ఫ్రెండ్ సామ్పాల్ రాయుడుకి బెదిరింపుల అంశాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా.. తన కుమార్తెలను అత్యాచారం చేస్తామనే అర్థం వచ్చేలా గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించినట్లు సామ్పాల్ తన పోస్టులో పేర్కొన్నారు.
అసలేం జరిగింది..
ఐపీఎల్లో ప్లేఆఫ్ స్టేజ్‌కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై కామెంటెటర్‌గా అంబటి రాయుడు సెటైర్లు వేశారు. ఆరెంజ్ క్యాప్ టైటిల్ తెచ్చి పెట్టదంటూ పరోక్షంగా కోహ్లీపై రాయుడు కామెంట్స్ చేశారు. ప్లే ఆఫ్ చేరడంతోనే టైటిల్ గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారనడంతో కోహ్లీ ఫ్యాన్ అంబటిని టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో అంబటిపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో పాటు.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు.
స్పందించని అంబటి..
తనకు బెదిరింపు కాల్స్ రావడంపై అంబటి రాయుడు నేరుగా స్పందించలేదు. తన ఫ్యామిలీ ఫ్రెండ్ సామ్పాల్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం ద్వారా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారని.. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంబటి రాయుడుకు అండగా ఉండాలని సామ్పాల్ కోరారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read more Andhra Pradesh and Telugu News