ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Father’s Sacrifice : తనయ కోసం తండ్రి ఆత్మహత్య

ABN, Publish Date - Dec 27 , 2024 | 05:29 AM

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెకు ఘనంగా వివాహం చేశాడు. కానీ అత్తింటి ఆరళ్లకు బలవుతుందేమోననే భయంతో పుట్టింటికి తీసుకొచ్చాడు.

  • కుమార్తెకు అత్తింటి వేధింపులు

  • ఆ బాధ చూడలేక విశాఖ నుంచి వచ్చి బలవన్మరణం

  • సీఎం, డిప్యూటీ సీఎంల పేరిట సూసైడ్‌ నోట్‌

కలిగిరి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెకు ఘనంగా వివాహం చేశాడు. కానీ అత్తింటి ఆరళ్లకు బలవుతుందేమోననే భయంతో పుట్టింటికి తీసుకొచ్చాడు. అయినా వారి వేధింపులు ఆగకపోవడంతో సీఎం, డిప్యూటీ సీఎంల పేరిట సూసైడ్‌ నోట్‌రాసి ఆ తండ్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయవిదారకమైన సంఘటన నెల్లూరు జిల్లా కలిగిరిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కలిగిరి మండలం తూర్పు దూబగుంటకు చెందిన బొట్టా శ్రీనివాసులు (52) 30 ఏళ్ల క్రితం స్వగ్రామాన్ని వదిలి ఉపాధి కోసం విశాఖ జిల్లా భీమిలికి వెళ్లాడు. అక్కడ ఇటుక బట్టీల వ్యాపారం చేసుకుంటూ భార్య, కుమారుడు, కుమార్తెతో జీవిస్తున్నాడు. ఆ ప్రాంతంలో భార్య తరఫు బంధువైన సూర్యకుమారి రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు తన కుమార్తె యమున (24)ను ఇచ్చి ఐదేళ్ల క్రితం ఘనంగా వివాహం చేశాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు(3) ఉన్నాడు. ఈ నేపథ్యంలో అప్పటివరకు బీడుగా ఉన్న భూముల పక్కన హైవే రావడంతో యమున అత్తింటివారి భూములు రూ.కోట్ల ధర పలికాయి. డబ్బు అమాంతంగా వచ్చిపడటం, యమున ఉన్నత చదువులు చదివి ఉండడం, ఆమె భర్తకు చదువులేకపోవడం తదితర కారణాలతో కొన్ని నెలలుగా యమునను వదిలించుకోవాలని అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. దీంతో శ్రీనివాసులు తన కుమార్తెను ఇంటికి తీసుకొచ్చాడు. రాజకీయ బలగం ఉన్న యమున అత్తింటివారు.. ఇటీవల ఆమెపై దాడి చేసి, మూడేళ్ల కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లారు.


ఈ విషయమై యమున తండ్రి స్థానిక దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చారు. కళ్లెదుటే కూతురు పడుతున్న బాధను చూడలేక విశాఖ నుంచి కలిగిరి వచ్చి నాలుగు రోజులుగా తన సోదరుడి ఇంటివద్ద ఉన్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్‌ నోట్‌ రాసి బుధవారం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీమిలి నుంచి వచ్చిన మృతుడి భార్య కుమారుడు, కుమార్తె, బంధువులు గురువారం కలిగిరి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. ఆత్మహత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. పోస్టుమార్టం అయ్యాక మృతదేహాన్ని భీమిలి తరలించారు.

సూసైడ్‌ నోట్‌ రాసి..

ఆత్మహత్య చేసుకునేముందు శ్రీనివాసులు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రులకు సూసైడ్‌ నోట్‌ రాశారు. ఆ నోట్‌లో తన కుమార్తెను అత్తింటి వారు ఎలా వేధించారో, తాను ఎంతటి మానసిక వేదనను గురయ్యానో వివరించాడు. తాను కూడా టీడీపీ సభ్యుడినేనంటూ, తన కుమార్తెను కాపాడాలంటూ ఐడీ కార్డుతో సహా రాసిన సూసైడ్‌ నోట్‌ స్థానికంగా సంచలనం రేపింది. ఉపాధి కోసం దూరప్రాంతానికి వెళ్లి, కుమార్తె బాధను చూడలేక స్వస్థలానికి వచ్చి శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకోవడం పలువురిని తీవ్రంగా కలిచివేసింది.

Updated Date - Dec 27 , 2024 | 05:29 AM