Share News

Tungabhadra: ఏపీ ప్రాజెక్టులకు తుంగభద్ర వర్రీ

ABN , Publish Date - Aug 12 , 2024 | 10:22 AM

ఏపీ ప్రాజెక్టులకు తుంగభద్ర వర్రీ పట్టుకుంది. తుంగభద్ర ప్రాజెక్టు 19 వ గేట్ కొట్టుకు పోవడంతో అక్కడి నుంచి వరద నీరు కిందికి వస్తోంది.

Tungabhadra: ఏపీ ప్రాజెక్టులకు తుంగభద్ర వర్రీ

అమరావతి: ఏపీ ప్రాజెక్టులకు తుంగభద్ర వర్రీ పట్టుకుంది. తుంగభద్ర ప్రాజెక్టు 19 వ గేట్ కొట్టుకు పోవడంతో అక్కడి నుంచి వరద నీరు కిందికి వస్తోంది. ప్రాజెక్టు ప్రస్తుతం నీటి నిల్వ 97 టీఎంసీలు కాగా.. 40 టీఎంసీలకు నీటి నిల్వలను తగ్గిస్తేనే ప్రాజెక్టు గేట్ పెట్టే అవకాశం ఉంది. ఈ వరద ప్రవాహం రేపు సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరే అవకాశం ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో ను అధికారులు పెంచుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 87 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1 లక్ష 90 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నీటి ప్రవాహంతో నిండిపోయాయి. వరద ప్రవాహం శ్రీశైలంను తాకిన వెంటనే నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులో వరద నీటి విడుదలపై నిర్ణయానికి రావాలని అధికారులు నిర్ణయించడం జరిగింది.


తుంగభద్ర ప్రాజెక్టు వద్దకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులు ఇవాళ వెళ్లి పరిశీలిస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు చెందిన గేటు కొట్టుకు పోయిన విషయం తెలిసిందే. నిన్న నే ప్రత్యేక బృందాన్ని సీఎం చంద్రబాబు పంపించడం జరిగింది. గత ఐదు సంవత్సరాలుగా ప్రాజెక్టుల కనీస నిర్వహణకు కూడా వైసీపీ సర్కార్ నిధులు ఇవ్వలేదు. తాజాగా తుంగభద్ర గేట్ కొట్టుకు పోవడంతో నిర్వహణ లోపాలు బహిర్గత మవుతున్నాయి. అటు కర్ణాటక, ఇటు ఏపీ ప్రభుత్వం కూడా తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తోంది. వైసీపీ సర్కార్ హయాంలో అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయింది. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం బహిర్గతమైంది.


అప్పటిలో ఈ రెండు ప్రాజెక్టులను అధికారులు ఖాళీ చేశారు. కనీసం గేట్లు నిర్వహణకు గ్రీజ్‌కు కూడా వైసీపీ సర్కార్ నిధులు ఇవ్వలేదు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడంలో కూడా అధికారుల నిర్లక్ష్యం ఉందని నివేదికలు వచ్చాయి. కనీసం అప్పటి ముంపు బాధితులకు ఇల్లు కూడా వైసీపీ ప్రభుత్వం నిర్మించి ఇవ్వలేదు. ఇక రేపు తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సందర్శించనున్నారు. ఇప్పటికే నీటి ఉధృతికి కొట్టుకపోయిన గేటు కోసం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో గజ ఈత గాళ్ల సాయంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. టీబీ బోర్డు అధికారులు కొత్త గేట్లను తయారు చేయిస్తున్నారు. గేట్లను అమర్చడంలో నిపుణులైన కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ కంపెనీలు ప్రతినిధులు మరమ్మతు పనులు చేయించారు.

Updated Date - Aug 12 , 2024 | 10:22 AM