ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Varla Ramaiah: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలు

ABN, Publish Date - Apr 03 , 2024 | 10:35 PM

సీఎం జగన్, వైసీపీ నేత పేర్ని నాని, కర్నూలు ఎస్పీపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. బుధవారం నాడు ఈ మేరకు ఓ లేఖ రాశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విరుద్ధంగా ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని స్కూల్ పిల్లలతో జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతి: సీఎం జగన్, వైసీపీ నేత పేర్ని నాని, కర్నూలు ఎస్పీపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. బుధవారం నాడు ఈ మేరకు ఓ లేఖ రాశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విరుద్ధంగా ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని స్కూల్ పిల్లలతో జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచార సమావేశంలో పాఠశాల పిల్లలను ఉపయోగించుకున్నందుకు గానూ సీఎం జగన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు. సస్పెండైన వలంటీర్లను తిరిగి వచ్చి, పింఛనుదారులను సచివాలయాలకు తీసుకువెళ్లి అల్లరి చేయాలని పేర్ని నాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. కావాలనే ప్రజల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వ్యతిరేకత తీసుకురావాలని పేర్ని నాని పన్నిన కుట్ర ఇదని చెప్పారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. తెనాలి పర్యటన రద్దు

ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడుకోవాలంటే అతనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌన్సిలింగ్ పేరుతో కర్నూలు ఎస్పీ తమ కార్యకర్తలను పిలిచి రాత్రంతా చిత్రహింసలు పెట్టి కొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీకి అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటే తప్పుడు కేసుల్లో ఇరికించి ఎన్నికల్లోపు అరెస్టు చేస్తామని బెదిరించారని మండిపడ్డారు. కావున వీరందరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని అదనపు ఎన్నికల ప్రధాన అధికారికి వర్లరామయ్య విజ్ఞప్తి చేశారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. తెనాలి పర్యటన రద్దు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 10:49 PM

Advertising
Advertising