Amarnath: జగన్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం.. షర్మిలకు గుడివాడ అమర్నాథ్ వార్నింగ్
ABN, Publish Date - Oct 26 , 2024 | 09:31 PM
షర్మిల రాజకీయంగా దిగజారిపోయారని..ఆమె ఎవరి పతనం కోరుకుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రత్యర్థుల మోచేయి నీళ్లను షర్మిల తాగుతున్నారని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డిపై కనీసం గౌరవం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని అమర్నాథ్ ఫైర్ అయ్యారు.
విశాఖపట్నం: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగన్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి షర్మిలకు ఆ నోరు ఎలా వచ్చిందని ధ్వజమెత్తారు. ఇవాళ(శనివారం) విశాఖపట్నంలోని తన కార్యాయలంలో మీడియాతో గుడివాడ అమర్నాథ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏ ఉద్దేశంతో షేర్లు బదలాయించారని నిలదీశారు. కాంటెమ్ట్ ఆఫ్ కోర్ట్ అయితే జగన్ బెయిల్ రద్దు కాదా అని ప్రశ్నించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్‌లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరారని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
షర్మిల రాజకీయంగా దిగజారిపోయారని.. ఆమె ఎవరి పతనం కోరుకుందని ప్రశ్నించారు. వైసీపీ ప్రత్యర్థుల మోచేయి నీళ్లను షర్మిల తాగుతున్నారని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డిపై కనీసం గౌరవం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీని బలహీన పరచాలనే ఆలోచన షర్మిలలో కనపడుతుందని అన్నారు. జగన్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.
రాజశేఖరరెడ్డి మరణించక ముందే ఆస్తులు పంచారు..
కాగా... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించక ముందే ఆయన పిల్లలకు ఆస్తులు పంచారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య వెల్లడించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ బతికుండగానే జగన్‌కు, షర్మిలకు ఎవరికి ఇచ్చే ఆస్తులను వారికి సవివరంగా రాసిచ్చారని తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నం.2 లోని 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15మెగావాట్ల ఎస్‌ఆర్‌ఎస్ హైడ్రో పవర్, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు లైసెన్సులు, స్వాతి పవర్ హైడ్రో ప్రాజెక్టులో వాటాలు, విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్‌లో 35శాతం వాటా, పులివెందులలో 7.6ఎకరాలు, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీని జగన్‌కు ఇచ్చారని వివరించారు.
భారతీ సిమెంట్స్, సాక్షి, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అన్నీ జగన్ సొంతమన్నారు. సరస్వతి భూములు రైతుల నుంచి జగన్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. 2010లో జగన్ పార్టీ ఏర్పాటు చేశాక టీడీపీ, కాంగ్రెస్ కూడబలుక్కొని సీబీఐ విచారణ కోరాయని, విచారణలో భాగంగా జగన్ ఆస్తులన్నింటినీ ఈడీ అటాచ్ చేసిందని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత ఆగస్టులో ఈడీ జప్తు చేసిన ఆస్తులన్నింటినీ చెల్లెలు షర్మిలకు జగన్ రాసిచ్చారని తెలిపారు. వైఎస్ బతికున్నప్పుడు చెప్పి ఉంటే కంపెనీల్లో వాటాలను షర్మిలకు జగన్ ఇచ్చి ఉండేవారని, జగన్ పెట్టిన కంపెనీలో షర్మిల షేర్ హోల్డర్‌గా లేరని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - Oct 26 , 2024 | 09:39 PM