Gudivada Amarnath: ‘తల్లికి వందనం’ పథకంపై అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Jul 12 , 2024 | 11:53 AM
Andhrapradesh: ‘తల్లికి వందనం’ పథకంపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకంపై విద్యార్థి తల్లిదండ్రులలో అనుమానం ఉందన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అందరికీ తల్లికి వందనం పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం, జూలై 12: ‘తల్లికి వందనం’ పథకంపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Former Minister Gudivada Amaranath) కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకంపై విద్యార్థి తల్లిదండ్రులలో అనుమానం ఉందన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అందరికీ తల్లికి వందనం పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి రామానాయుడు (Minister Nimmala Ramanaidu) .. ఇంట్లో ఎంత మంది ఉంటే.. అంత మందికి రూ.15 వేలు ఇస్తామని చెప్పిన వీడియోను ఈ సందర్భంగా మాజీ మంత్రి మీడియాకు చూపించింది. సూపర్ సిక్స్ ఎటు వెళ్ళిపోయిందో అని వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇచ్చిన మాట నిల బెట్టుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.
ఆ మాట నా చిన్నప్పటి నుంచి వింటున్నా...
తమ పార్టీ అధినేత జగన్ పై టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు.. భవిష్యత్తు కార్యక్రమాలు చెప్పకుండా విమర్శలు చేశారన్నారు. భోగాపురం విమానశ్రయం పనులను శరవేగంగా జరగడానికి తాము ఎంతో కృషి చేశామని చెప్పుకొచ్చారు. రైతులను ఒప్పించి భూసేకరణ చేశామన్నారు. వైసీపీ చేసిన ప్రగతిని.. కూటమి అకౌంట్‌లో వేసుకోవడం దారుణమని మండిపడ్డారు.
విశాఖని ఆర్ధిక రాజధాని చేస్తామని తన చిన్నప్పటి నుంచి వింటున్నానని తెలిపారు. ఆచరణలో ఎక్కడా లేదన్నారు. ఉచిత ఇసుక అన్నారని... అన్ని చార్జీలు కలిపి టన్నుకు 1400 రూపాయిలు తీసుకున్నారన్నారు. ప్రజలకు మంచి జరగాలనేదే తమ ఆశయమన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేసే వరకు ఒత్తిడి చేస్తామని స్పష్టం చేశారు. ఒక పత్రిక కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Landslides: కొండచరియలు విరిగిపడి, నదిలో పడ్డ 2 బస్సులు.. 63 మంది గల్లంతు
Arvind Kejriwal: సుప్రీంలో కేజ్రీవాల్‌కు బెయిల్
Read Latest AP News AND Telugu News
Updated Date - Jul 12 , 2024 | 12:03 PM