Homeminister Anitha: విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత
ABN, Publish Date - Jul 02 , 2024 | 03:46 PM
Andhrapradesh: విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసులు పని చేయడానికి సరైన వసతులు లేవని.. మహిళ పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు.
విశాఖపట్నం, జూలై 2: విశాఖ సెంట్రల్ జైలుని (Visakha Central Jail) హోంమంత్రి వంగలపూడి అనిత (Home minister Vangalapudi Anitha) మంగళవారం సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసులు పని చేయడానికి సరైన వసతులు లేవని.. మహిళ పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు. పోలీస్ వెహికల్ ముందు వెళ్తుంటే... వెనుక ఉన్న వారు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. లోపల పరిస్థితులు చూస్తే హృదయ విధారకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
Minister Tummala: రైతు ఆత్మహత్యపై మంత్రి తుమ్మల ఆగ్రహం.. తక్షణమే విచారణ చేయాలంటూ ఆదేశం..
రూ.10 వేల కోసం గంజాయి కేసుల్లో ఇరుకున్ని జైల్లో మగ్గుతున్నారన్నారు. ప్రధాన నిందితులు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. జైల్లోనే గంజాయి డి అడిక్షన్ సెంటర్ పెట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. ఈరోజే సీఎస్ఆర్ నిధులతో 76 టెస్టులు నిర్వహించే ఒక ల్యాబ్ ప్రారంభించామన్నారు. క్షమాభిక్షులకు కూడా ఐదేళ్ల నుంచి నిలిపివేశారన్నారు. లోపల అనేక వస్తువులు తయారు చేస్తున్నారని.. వాటిని అమ్మకాలు చేసేందుకు కూడా తాము ఆలోచన చేస్తామని చెప్పారు. గంజాయిని అరికట్టేందుకే మంత్రుల సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఈరోజు జైల్లో పర్యటించామన్నారు. కనీసం బెయిల్ మంజూరు చేసుకోలేక అనేక మంది జైల్లో మగ్గుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి....
Nara Lokesh: కావలి రోడ్డు ప్రమాదంపై లోకేష్ స్పందన
AP Pensions: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. రూ. 200 కోత
Read Latest AP News AND Telugu News
Updated Date - Jul 02 , 2024 | 04:01 PM