AP Politics: సీఎస్ జవహర్ రెడ్డిపై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన జనసేన నేత
ABN, Publish Date - May 30 , 2024 | 03:36 PM
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై (CS Jawahar Reddy) వరుసగా జనసేన నేత మూర్తి యాదవ్ ( Murthy Yadav) సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలపై సీఎస్ కార్యాలయం నోటీసులు కూడా పంపించింది. అయితే జనసేన నేత మూర్తి యాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
విశాఖపట్న: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై (CS Jawahar Reddy) వరుసగా జనసేన నేత మూర్తి యాదవ్ ( Murthy Yadav) సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలపై సీఎస్ కార్యాలయం నోటీసులు కూడా పంపించింది. అయితే జనసేన నేత మూర్తి యాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం విశాఖలోని జనసేన కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎస్ బినామీలు భూములు అమ్ముతున్నారు...
‘నేను ఇదివరకు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. తర్లువాడలో భూములను జవహర్ రెడ్డి తన బినామీ పేరుతో కొట్టేశారు. మంత్రి మేరుగు నాగార్జున సీఎస్‌తో డ్యూయల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈసీ కాపీ రాకుండా రెవిన్యూ వెబ్‌సైట్ బ్లాక్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి వ్యవహారాలను చోడురాజు, సత్య కృష్ణంరాజు చూసే వారు. జవహర్‌కి మరో బినామీ విశాఖలో పెరిచర్ల శ్రీనివాసరాజు. ఆయన ఎర్ర మట్టి దిబ్బలు దగ్గర వంద ఎకరాలు రాయించుకున్నారు. జవహర్ రెడ్డి బినామీలు సత్య కృష్ణంరాజు, శ్రీనివాసరాజులు విశాఖలో పలచోట్ల లే అవుట్ వేసి అమ్ముతున్నారు. వీటితో జవహర్ రెడ్డికి సంబంధం ఉందో లేదో చెప్పాలి’’ అని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు.
అప్పన్న స్వామి మీద ప్రమాణం చేద్దాం..
‘‘సీఎస్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి. ఈ భూకుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో గాని సీబీఐతో గాని విచారణ జరిపించాలి. జవహర్ రెడ్డి డబ్బులతోనే ఈ బినామీలు ఆస్తులను కొనుగోలు చేశారు.జవహర్ రెడ్డిపై నేను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. సీఎస్ జవహర్ రెడ్డికు దమ్మంటే సింహాచలం అప్పన్న స్వామి దగ్గర తనకు విశాఖ భూములతో ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయాలి. నేను చెప్పింది నిజమేనని... నేను నా కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేస్తాను’’ అని సీఎస్ జవహర్ రెడ్డికు జనసేన నేత మూర్తియాదవ్ సవాల్ విసిరారు.
AP Election2024: ఆందోళనలను ప్రేరేపించేలా సజ్జల వ్యాఖ్యలు: దేవినేని ఉమ
AP Election Result: కాన్ఫిడెన్స్ తగ్గిందా.. ఫలితాలకు ముందు వైసీపీ నేతల్లో టెన్షన్..!
AP politics: పేట్రేగిపోతున్న వైసీపీ మూకలు.. బెంబేలెత్తుతున్న ఎన్నికల అధికారులు..!
Chandrababu: చంద్రబాబు ఎఫెక్ట్.. యూపీఎస్సీ నిర్ణయంతో కంగుతిన్న వైసీపీ!
Updated Date - May 30 , 2024 | 03:41 PM