ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KA Paul: రుషికొండ లోపల నరబలి జరిగిందేమో?.. కేఏపాల్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 29 , 2024 | 01:15 PM

Andhrapradesh: రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ఈరోజు (గురువారం) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రుషికొండకు వద్దకు చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు చేరుకున్న పాల్‌ను పోలీసులు అడ్డుకుని కారు దిగనివ్వకుండా చుట్టుముట్టారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 29: రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ఈరోజు (గురువారం) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రుషికొండకు వద్దకు చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్‌ను (Prajashanti Party Chief KA Paul) పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు చేరుకున్న పాల్‌ను పోలీసులు అడ్డుకుని కారు దిగనివ్వకుండా చుట్టుముట్టారు. దీంతో ఆయన కారులోనే ఉండిపోయారు. పోలీసుల తీరుపై పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మీడియా పట్ల కూడా పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. పాల్ దగ్గరికి మీడియా వారిని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.

కొద్దిసేపటి తర్వాత మీడియాతో మాట్లాడిన పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ లోపల ఏం జరుగుతుందో తెలియాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఎందుకు అంత సీక్రెట్ అని ప్రశ్నించారు. ‘‘నన్ను పోలీసులు అడ్డుకున్నారు... దారుణం.. నన్ను ఎందుకు ఆపారు? మీడియాకు కూడా ఎందుకు అనుమతి ఇవ్వలేదు? శారదా పీఠం స్వామిని పిలిచారు... నన్ను ఎందుకు పిలవలేదు.. పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? లోపల నరబలి ఏమయినా జరిగిందేమో అని అనుమానం ఉంది. రుషికొండ అక్రమాలు, ప్రారంభోత్సవాలపై కోర్టుకు వెళ్లి పిల్ వేస్తాను’’ అని కేఏపాల్ స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 29 , 2024 | 01:21 PM

Advertising
Advertising