ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: అది నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. లోకేష్‌‌కు అమర్నాథ్ ఓపెన్ ఛాలెంజ్

ABN, Publish Date - Feb 20 , 2024 | 04:37 PM

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్‌కు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అవినీతి చేసినట్టు కానీ, భూ ఆక్రమణలకు పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను అంటూ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్‌నే ఏమీ పీకలేకపోయారు... నువ్వెంత అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: టీడీపీ యువనేత నారా లోకేష్‌కు (TDP Leader Nara lokesh) మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అవినీతి చేసినట్టు కానీ, భూ ఆక్రమణలకు పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను అంటూ సవాల్ విసిరారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి... ‘‘పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawankalyan) నన్ను ఏమీ పీకలేకపోయారు... నువ్వెంత. పూరి గుడిసె నుంచి రాయల్ ప్యాలెస్‌లోకి ఎలా ఎదగగలిగావో చెప్పగలవా లోకేష్. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే 420.... అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని నన్ను విమర్శిస్తారా.. నేను పాలు తాగి పెరిగితే... మాజీ ఎమ్మెల్యే గోవింద్ సారా తాగి పెరిగాడు.. సారా కాసుకుని పెరిగిన నా కొడుకులు అందరూ నన్ను విమర్శిస్తారా.. శంఖారావం అని పలకడం కూడా తెలియని మొద్దు లోకేష్. లోకేష్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న అంటూ.. మట్టి కుండలో పప్పు.. ఉప్పు, కారం కలిపి సిద్ధంగా వుంచాం. లోకేష్ తనంతట తానుగా వచ్చిన సరే లేకపోతే నేనే పంపిస్తాను. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), లోకేష్‌లలో పౌరుషం, రోషం రావాలనే పప్పులో ఉత్తరాంధ్ర ఉప్పు, కారం కలిపా. లోకేష్‌లా నేను బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదు.. కష్టపడి క్రింది స్థాయి నుండి వచ్చిన వాడిని’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఏ బాబైనా సీటు డిసైడ్ చేసేది చంద్రబాబే...

రెండు రోజుల్లో టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో చెరబోతున్నాయని.. అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయన్నారు. అప్పుడు సీట్లన్నీ బాబు డిసైడ్ చేస్తారని తెలిపారు. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా.. తమ విధానంలో మార్పు లేదని స్పష్టం చేశారు. నాగబాబు అయినా ఇంకో బాబైనా వారి సీటు బాబు డిసైడ్ చేస్తారు అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 20 , 2024 | 04:37 PM

Advertising
Advertising