MP CM Ramesh: జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి జాడ లేదు
ABN, Publish Date - Oct 20 , 2024 | 05:51 PM
వైసీపీ ప్రభుత్వంలా ఇసుక, భూమాఫియాలు కూటమి ప్రభుత్వంలో ఉండవని ఎంపీ సీఎం.రమేష్ అన్నారు. ఎలక్షన్‌లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. ఇంటింటికీ మంచినీరు సదుపాయం వచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు
అనకాపల్లి జిల్లా: జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి జాడ లేదని ఎంపీ సీఎం.రమేష్ అన్నారు. పల్లెపండుగ కార్యక్రమంలో సీఎం రమేష్ పాల్గొన్నారు. 2018లో 34 వేల కిలోమీటర్ల రోడ్లు పనులు జరిగాయని తెలిపారు. మాడుగుల నియోజకవర్గానికి రూ. 30 కోట్లు ప్రధాని మంత్రి నరేంద్రమోదీ కేటాయించారని అన్నారు. ఇవాళ(ఆదివారం) అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం.రమేష్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఎంపీ సీఎం.రమేష్ మాట్లాడారు.
ఆంద్రప్రదేశ్‌లో రానున్న కాలంలో రూ. 50 కోట్లు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో రోడ్లు వేయాలని అన్నారు. గత మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుకు.. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు చాలా తేడా ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలా ఇసుక, భూమాఫియాలు కూటమి ప్రభుత్వంలో ఉండవని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. ఇంటింటికీ మంచినీరు సదుపాయం కల్పిస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ఇస్తామని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Amaravati: అతనికి మరణ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.. బద్వేల్ ఘటనపై సీఎం చంద్రబాబుః
Minister Kondapalli: ప్రజలు భయాందోళన చెందేలా ప్రతిపక్షాల వ్యాఖ్యలు..
AP News: ఏబీఎన్‌తో మంత్రి ఆనం ఆసక్తికర వ్యాఖ్యలు..
For more AP News and Telugu News
Updated Date - Oct 20 , 2024 | 05:55 PM