ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Weather Alert: బిగ్ అలర్ట్.. ఐదు రోజులు వర్షాలే వర్షాలు..

ABN, Publish Date - Jun 07 , 2024 | 09:24 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించింది. ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..

Weather Updates

Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించింది. ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. 3, 4 రోజుల్లో నైరుతి రుతు పవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.


ఈ రుతుపవనాల ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 5 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈదురు గాలులు కూడా బలంగా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమ ప్రాంతంలోనూ చదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొదటి రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఆ తరువాత రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు చోట్ల పడే అవకాశం ఉందని చెప్పారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 07 , 2024 | 09:24 PM

Advertising
Advertising