YV Subbareddy: నేను షర్మిల వద్దకు ఎలాంటి రాయబారాలు మోయలేదు
ABN, Publish Date - Jan 02 , 2024 | 04:12 PM
తాను వైస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ( YS Sharmila ) వద్దకు ఎలాంటి రాయబారాలు మోయలేదని వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి ( YV Subbareddy ) తెలిపారు. మంగళవారం నాడు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మని నెల రోజుల తర్వాత హైదరాబాద్‌లో కలిసేందుకు వెళ్లాను. కుటుంబ సభ్యులను కూడా కలవకూడదా అని ప్రశ్నించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
విశాఖపట్నం: తాను వైస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ( YS Sharmila ) వద్దకు ఎలాంటి రాయబారాలు మోయలేదని వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి ( YV Subbareddy ) తెలిపారు. మంగళవారం నాడు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మని నెల రోజుల తర్వాత హైదరాబాద్‌లో కలిసేందుకు వెళ్లాను. కుటుంబ సభ్యులను కూడా కలవకూడదా అని ప్రశ్నించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగిందన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినా తమకు ఇబ్బంది లేదన్నారు. సీఎం జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు వైసీపీని రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తాయని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో కొంత మందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదన్నారు. వారికి నచ్చ జేప్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని చెప్పారు. అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు. దాడి వీరభద్రరావుకి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని.. అయన రాజీనామా చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజమన్నారు. జగన్‌ను ఎదుర్కొనలేక ఇలా కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడెక్కడ పార్టీ బలహీన పడిందో అక్కడ సీట్ల విషయంలో మార్పులు, చేర్పులు ఉంటాయని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - Jan 02 , 2024 | 04:26 PM