ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Janasena Candidates: చివరి అభ్యర్థిని ప్రకటించేసిన జనసేన.. పాలకొండ అభ్యర్థి ఎవరంటే..

ABN, Publish Date - Apr 10 , 2024 | 07:41 AM

Andhra Pradesh: జనసేన పార్టీ మిగిలిన ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని(Janasena MLA Candidate) కూడా ప్రకటించేసింది. ఇప్పటి వరకు సస్పెన్స్‌గా ఉన్న పాలకొండ(Palakonda) ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసింది జనసేన(Janasena) అధిష్టానం. పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను(Jaya Krishna) ఎంపిక చేశారు.

Janasena Candidates

Andhra Pradesh: జనసేన పార్టీ మిగిలిన ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని(Janasena MLA Candidate) కూడా ప్రకటించేసింది. ఇప్పటి వరకు సస్పెన్స్‌గా ఉన్న పాలకొండ(Palakonda) ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసింది జనసేన(Janasena) అధిష్టానం. పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను(Jaya Krishna) ఎంపిక చేశారు. ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన పాలకొండ నుంచి కూటమి అభ్యర్థిగా జయకృష్ణ బరిలో నిలవనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారంటూ జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ ఒక ప్రటకన విడుదల చేశారు. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉండి పోటీ పడటంతో పలు దఫాలుగా జనసేన పక్షాలు సర్వేలు నిర్వహించడం జరిగిందని.. ఈ సర్వేలో జయకృష్ణకు అత్యధికంగా ప్రజల మద్దతు లభించిందని పేర్కొన్నారు. దీంతో పాలకొండ అభ్యర్థిగా జయకృష్ణ పేరును పవన్ కల్యాణ్ ఎంపిక చేశారని ప్రకటనలో పేర్కొన్నారు.

టీడీపీ, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లు దక్కాయి. ఇందులో భాగంగా విడతల వారీగా జనసేన తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. తాజా ప్రకటనతో జనసేన పోటీ చేసే మొత్తం 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 07:41 AM

Advertising
Advertising