YSRCP: నెల్లూరులో వైసీపీకి షాకిచ్చిన 40 మంది వలంటీర్లు
ABN, Publish Date - Apr 12 , 2024 | 01:56 PM
నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్డీఏ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అభ్యర్థి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో 40 మంది వలంటీర్లు చేరారు. టీడీపీ కండువాలు కప్పి వేమిరెడ్డి దంపతులు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (CM Jagan)కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్డీఏ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అభ్యర్థి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో 40 మంది వలంటీర్లు చేరారు. టీడీపీ కండువాలు కప్పి వేమిరెడ్డి దంపతులు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. విడవలూరు మండలం నుంచి వలంటీర్లు రాజీనామా చేసి టీడీపీలో చేరారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారంతా రూ.5వేల జీతానికి పని చేశారని ప్రశాంతి రెడ్డి తెలిపారు.
AP Election 2024: ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతున్న వైసీపీ.. ప్రచారం కోసం భారీ ప్లాన్
టీడీపీ ప్రభుత్వం రాగానే వలంటీర్లకి తిరిగి ఉద్యోగాలు వస్తాయని... వారికి రూ.10వేల జీతం ఇస్తామని వెల్లడించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని ప్రశాంతి రెడ్డి అన్నారు. అందుకే వలంటీర్లు ముందుకొచ్చి టీడీపీలో చేరారన్నారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. మీరు చేసిన అభివృద్ధిని గురించి ప్రజలకి చెప్పి ఓటు అడగాలని వైసీపీ నేతలకు ఆమె సూచించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని ప్రశాంతి రెడ్డి అన్నారు. మొత్తానికి ఎవరినైతే నమ్ముకుని వైసీపీ రాజకీయం చేస్తోందో ఆ వలంటీర్లే పార్టీని వీడటం ఇబ్బందికర పరిణామమే.
AP Politics: చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతల కీలక భేటీ..
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 12 , 2024 | 01:56 PM