AP NEWS: శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం
ABN, Publish Date - Jun 18 , 2024 | 04:36 PM
ఏలూరు జిల్లా కామవరపుకోటలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో (Sri Venkateswara Junior College) అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. గత 40 సంవత్సరాలుగా ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కాలేజ్ నడుస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కాలేజీని పట్టించుకోక పోవడంతో విద్యార్థులు తగ్గిపోయారు.
ఏలూరు: ఏలూరు జిల్లా కామవరపుకోటలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో (Sri Venkateswara Junior College) అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. గత 40 సంవత్సరాలుగా ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కాలేజ్ నడుస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కాలేజీని పట్టించుకోక పోవడంతో విద్యార్థులు తగ్గిపోయారు. దాంతో నెల క్రితం అడ్మిషన్లు నిలిపి వేస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. అయితే కాలేజీ మూసివేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు తమ సమస్యను విన్నవించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా చూస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ , చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ తో మాట్లాడి అడ్మిషన్లు జరిగేలా చర్యలు చేపట్టడంతో నేడు కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
అడ్మిషన్ల కోసం విద్యార్థులు కాలేజీకి వెళ్తున్నారు. కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం అవడం పట్ల చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల కాలేజీ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆదరణకు నోచుకోలేక ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యార్థుల సమస్యను తీర్చి వారికి అండగా నిలబడ్డామని మురళి తెలిపారు.
Updated Date - Jun 18 , 2024 | 04:36 PM