TDP: ఉండి టీడీపీ అసెంబ్లీ టికెట్ వివాదం కొలిక్కి వచ్చేనా..?
ABN, Publish Date - Feb 29 , 2024 | 11:05 AM
Andhrapradesh: ఉండి టీడీపీ అసెంబ్లీ టికెట్ వివాదంపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఉండి టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి హైకమాండ్ కేటాయించింది. అయితే అధిష్టానం తీరుపై మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ ఆశిస్తున్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండానే రామరాజుకి టికెట్ ఇచ్చారంటూ మండిపడ్డారు.
పశ్చిమగోదావరి, ఫిబ్రవరి 29: ఉండి టీడీపీ (TDP) అసెంబ్లీ టికెట్ వివాదంపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఉండి టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు (MLA Ramaraju) హైకమాండ్ కేటాయించింది. అయితే అధిష్టానం తీరుపై మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (Former MLA Vetukuri Shivarama raju) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ ఆశిస్తున్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండానే రామరాజుకు టికెట్ ఇచ్చారంటూ మండిపడ్డారు. రామరాజుకు సహకరించేదీ లేదని శివరామరాజు తేల్చిచెప్పేశారు. ఒక దశలో వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసినట్లు సమాచారం. దీంతో పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన టీడీపీ అధిష్టానం.. శివరామరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ బాధ్యతను ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు (Raghuram Krishnaraju) అప్పగించింది. ఈ క్రమంలో ఇద్దరు నేతలను హైదరాబాద్ రావాలని ఎంపీ రఘురామ సమాచారం ఇచ్చారు. ఈరోజు (గురువారం) ఉదయం శివరామరాజు, ఎమ్మెల్యే రామరాజు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. మరి ఇరువురు నేతల మధ్య ఎంపీ రఘురామ సయోధ్య కుదర్చడంలో సక్సెస్ అవుతారా?.. సమావేశం తర్వాత శివరామరాజు నిర్ణయం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ టీటీడీ వర్గాల్లో నెలకొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 29 , 2024 | 11:05 AM