AP Elections: ఉంగుటూరులో అధిపత్యం ఎవరిది.. ?
ABN, Publish Date - Apr 18 , 2024 | 09:18 AM
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గెలుపుకోసం రాజకీయ పార్టీలు వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఏ నియోజకవర్గంలో పక్కాగా గెలవచ్చు.. ఏ నియోజకవర్గంలో తమకు కష్టంగా ఉందనే అంచనాలను అన్ని పార్టీలు వేస్తున్నాయి. దానికి అనుగుణంగా తమ వ్యూహాలను రచిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు కూటమితో పాటు వైసీపీ తమ ప్రణాళికలను రెడీ చేశాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వగా.. క్షేత్రస్థాయిలో నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈక్రమంలో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఉంగుటూరు నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గెలుపుకోసం రాజకీయ పార్టీలు వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఏ నియోజకవర్గంలో పక్కాగా గెలవచ్చు.. ఏ నియోజకవర్గంలో తమకు కష్టంగా ఉందనే అంచనాలను అన్ని పార్టీలు వేస్తున్నాయి. దానికి అనుగుణంగా తమ వ్యూహాలను రచిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు కూటమితో పాటు వైసీపీ తమ ప్రణాళికలను రెడీ చేశాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వగా.. క్షేత్రస్థాయిలో నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈక్రమంలో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఉంగుటూరు నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ నియోజకవర్గంోల అధిప్యతం ఎవరిది.. ఎలాంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
Loksabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం
సౌకర్యాలు అధ్వానం
ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనడానికి నిదర్శనం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం. చిన్న తిరుపతిగా ప్రసిద్ధ చెందిన ద్వారకా తిరుమల ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది. నిత్యం వేలాదిమంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈప్రాంతానికి సరైన రహదారులు లేవు. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధిలో నియోజకవర్గం వెనుకపడిందని ఇక్కడి ప్రజలు చెబుతున్న మాట. ఈ జిల్లాలోనే దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నా.. ద్వారకా తిరుమలను అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి.
చారిత్రాక, రాజకీయ నేపథ్యం
భీమడోలు, ద్వారకాతిరుమల, ఉంగుటూరు , నల్లజర్ల మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. పూర్తి గ్రామీణ వాతావరణాన్ని తలపించే ఉంగుటూరుకు చారిత్రక, రాజకీయ నేపథ్యం ఉంది. వ్యవసాయం ఇక్కడి ప్రజల జీవనాధారం. గోదావరి డెల్టా కాలువల ఆధారిత వ్యవసాయ ప్రాంతం ఇది. ఓవైపు వరి పైరులు మరోవైపు చేపలు, రొయ్యల చెరువులు అధికం. రైసుమిల్లులకు కేంద్రమైన ఈ నియోజకవర్గం ఆక్వా ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆశాజనకంగా లేదని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. సీఎం జగన్ ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేకపోయారంటున్నారు. ఇక్కడి యువతకు ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు దక్కలేదు.
స్వతంత్ర సమరయోధులు దివంగత చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తి రాజు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఉంగుటూరు. ఆయన స్వతంత్ర పోరాటంలో గాంధీజీతో కలిసి పోరాడి, మహాత్ముడిపై అనేక రచనలు రాశారు. స్వగ్రామంలో పార్లమెంటును పోలివుండే భవనాన్ని నిర్మించి గాంధీపై రచనలతో కూడిన లైబ్రరీని ఏర్పాటుచేశారు. అంతటిఘన చరిత్ర ఉన్న ఉంగుటూరును వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రధాన సమస్యలు
నియోజకవర్గాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలు తాగునీరు, అధ్వానస్థితిలో ఉన్న రహదారులు. ఐదేళ్ల కాలంలో రాష్ట్రప్రభుత్వం ఎటువంటి రహదారుల నిర్మాణం చేపట్టలేదు. విద్య, వైద్య సౌకర్యాలు నియోజకవర్గంలో అంతంతమాత్రంగానే ఉన్నాయి. పై చదువుల కోసం తాడేపల్లిగూడెం. ఏలూరు వెళ్లాల్సిన పరిస్థితి. డ్రెయినేజీ సమస్య ఈ ప్రాంత ప్రజలను పీడిస్తుంది.
బరిలో ఎవరంటే..
2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పుప్పాల శ్రీనివాసరావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి వైసీపీ నుంచి పోటీచేస్తున్నారు. ఎన్డీయే కూటమి తరపున జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు పోటీచేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీ అభ్యర్థికి మైనస్‌గా మారే అవకాశం ఉంది. గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం, బీజేపీ పొత్తు జనసేన అభ్యర్థి ధర్మరాజుకు ప్లస్‌గా చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న ఓటర్లు జనసేన అభ్యర్థి వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ద్విముఖ పోరులో కూటమి అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయనే చర్చ ఈ నియోజకవర్గంలో సాగుతోంది.
CM Jagan: తూ.గో. జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 18 , 2024 | 09:32 AM