ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వం మారినా ఇంకా ఇదేం పద్ధతి..?

ABN, Publish Date - Jul 21 , 2024 | 07:52 PM

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారి 45 రోజులు దాటింది కూడా..! అయినా సరే ఇంకా పాత వాసనలు పోలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి..!

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారి 45 రోజులు దాటింది కూడా..! అయినా సరే ఇంకా పాత వాసనలు పోలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి..! ఎందుకంటే.. సీఎం నారా చంద్రబాబు సంతకం పెట్టడం, కేబినెట్ కూడా ఆమోదించినప్పటికీ ఇంతవరకూ యూనిర్శిటీ పేరు మారకపోవడం గమనార్హం. దీంతో అసలు ఏం జరుగుతోంది..? ఇదంతా పనిగట్టుకునే చేస్తున్నారా..? లేకుంటే మరో కారణం ఏమైనా ఉందా అనే అనుమానాలు కలుగుతున్న పరిస్థితి.


ఇదీ అసలు కథ..!

వైసీపీ హయాంలో మారిన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును.. కూటమి అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మార్చింది. ఇందుకు సీఎం నారా చంద్రబాబుతో పాటు కేబినెట్ ఆమోదం కూడా లభించింది. అయినా ఇంకా ప్రభుత్వ ప్రకటనల్లో మాత్రం పేరు మారలేదు. ఆదివారం నాడు ఓ దిన పత్రికలో డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎండీఎస్ మేనేజ్మెంట్ కోటా, కాంపిటేట్ అథారిటీ కోటా పేరుతో అడ్మిషన్స్‌కు పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ ప్రకటనను యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రాధికా రెడ్డి రిలీజ్ చేశారు. అయితే.. యూనివర్శిటి పేరు మారిందన్న విషయం రిజిస్ట్రార్ మరిచిపోయారో లేకుంటే ఇంకేం జరిగిందో తెలియట్లేదు కానీ.. ప్రకటన అలాగే ఇవ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మారని అధికారుల తీరుపై.. ఇష్టానుసారం ప్రకటనలు ఇవ్వడంతో ఉన్నతాధికారులు క్లాస్ తీసుకోగా.. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది.


నాటి నుంచి నేటి వరకూ..!

వాస్తవానికి.. వైసీపీ హయాంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్.. అధికారులు, ఉన్నతాధికారులు, యూనివర్శిటీ వీసీలు ఇలా ఎక్కడా పాత వాసనలు లేకుండా ఇప్పుడిప్పుడే కూటమి సర్కార్ ప్రక్షాళన చేస్తూ వస్తోంది. ఆ మధ్య జీపీఎస్‌ జీవో, గెజిట్ రిలీజ్ వ్యవహారంలో ఎంత రాద్ధాంతం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆఖరికి విచారణ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా రిజిస్ట్రార్ తీరుతో మరోసారి పాత వాసన అనేది బయటపడింది. అందుకే.. ఇకపై ఎలాంటి ప్రకటన అయినా, జీవోలు, గెజిట్‌ల విషయంలో ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకుని ఉన్నతాధికారుల అనుమతితో రిలీజ్ చేయాలని అన్ని విభాగాలకు సమాచారం క్లియర్ కట్‌గా వెళ్లిందని తెలిసింది.

Updated Date - Jul 21 , 2024 | 07:52 PM

Advertising
Advertising
<