Yarapathineni: పల్నాడును రావణకాష్టంగా మార్చారు.. పిన్నెల్లిపై యరపతినేని ఫైర్
ABN, Publish Date - Apr 15 , 2024 | 10:26 PM
ఐదేళ్ల వైసీపీ పాలనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడును రావణకాష్టంగా మార్చారని గురజాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasa Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి నుంచి పల్నాడుకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎన్నో అరాచకాలు చేశారని మండిపడ్డారు.
పల్నాడు జిల్లా: ఐదేళ్ల వైసీపీ పాలనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడును రావణకాష్టంగా మార్చారని గురజాల తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasa Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి నుంచి పల్నాడుకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎన్నో అరాచకాలు చేశారని మండిపడ్డారు. ఓటమి భయంతో పోలింగ్ బూతులను వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్టించారని ఆరోపించారు.
AP Police: జగన్‌పై రాయి విసిరిందెవరో చెప్పేయండి.. బహుమతి కొట్టేయండి..
గురజాలకు యరపతినేని శ్రీనివాసరావు ఉన్నాడనే విషయాన్ని కాసు మహేష్ మర్చిపోయారని అన్నారు. ఈ ఎన్నికల్లో గురజాలలో ఆత్మ గౌరవానికి, అహంకారానికి మధ్య పోటీ అని చెప్పారు. గురజాల ఆత్మగౌరవం గెలవాలన్నారు. వైసీపీ పాలలో అరాచకాలు తప్ప అభివృద్ధి ఏం లేదన్నారు. గురజాల నియోజకవర్గంలో 11 మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీ మూకలు హత్య చేశారని ధ్వజమెత్తారు.
ఎస్సీ, ఎస్టీ , బీసీలను హత్యలు చేశారని విమర్శించారు వందల మందిపై దాడులు చేసి హత్య ప్రయత్నం చేశారన్నారు. మహిళా, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేశారని విమర్శించారు. కాసు మహేష్ నిక్కర్ వేసుకునే వయస్సులో తాను ఎమ్మెల్యే అయ్యానని గుర్తుచేశారు. గురజాలలో కాసు అరాచకాలకు అడ్డుకట్ట వేస్తానని హెచ్చరించారు. నెల తర్వాత కాసు మహేష్ రెడ్డి కొవ్వు కరిగిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
AP Elections: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
రాష్ట్ర స్థాయి బీసీ నేత జంగా కృష్ణమూర్తిను కాసు మహేష్ రెడ్డి ఘోరంగా అవమానించారని విరుచుకుపడ్డారు. నోటి పారుదల మంత్రి అనిల్‌ను తుమ్మల చెరువు టోల్ గేట్ కూడా దాటనీయమని మందలించారు. ఎన్నికల అనంతరం వైసీపీ నేతల కే ఆర్ ఆఫ్ ఎక్కడో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. తాను లావు శ్రీ కృష్ణ దేవరాయులు అంతా సౌమ్యుడుని కాదన్నారు. తనను రెచ్చగొట్టవద్దని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 15 , 2024 | 10:34 PM