ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: ఆదిమూలం దెబ్బతో దిగొచ్చిన వైసీపీ హైకమాండ్

ABN, Publish Date - Feb 01 , 2024 | 08:30 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వైఎస్ఆర్ సీపీ దృష్టిసారించింది. అభ్యర్థుల మార్పు ప్రక్రియ కంటిన్యూ చేస్తోంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాత్రం హై కమాండ్ మాట వినలేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. దీంతో వైసీపీ హైకమాండ్ దెబ్బకు దిగొచ్చి అభ్యర్థిని మార్చింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వైఎస్ఆర్ సీపీ (YCP) దృష్టిసారించింది. అభ్యర్థుల మార్పు ప్రక్రియ కంటిన్యూ చేస్తోంది. కొన్ని చోట్ల నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హై కమాండ్ మాట వినలేదు. అసెంబ్లీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని చెప్పడంతో బరిలోకి దిగనని ఆయన తెగేసి చెప్పారు. ఇంతలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. వైసీపీ హైకమాండ్ దెబ్బకు దిగొచ్చింది. వెంటనే ఆ సీటులో అభ్యర్థి పేరును మార్చింది.

పేరు మార్పు

ఇటీవల వైసీపీ (YCP) ఐదో జాబితా విడుదల చేసింది. అందులో సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం పేరు తిరుపతి లోక్ సభ అభ్యర్థిగా ఉంది. అలాగే సత్యేవేడు అసెంబ్లీకి తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరును ఖరారు చేసింది. తిరుపతి నుంచి లోక్ సభకు పోటీ చేయనని ఆదిమూలం తెగేసి చెప్పారు. ఆ వెంటనే టీడీపీ నేత లోకేశ్‌ను కలిశారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత ఆరో జాబితాలో వైసీపీ మార్పులు చేసింది. గురుమూర్తి పేరును తిరుపతి లోక్ సభ అభ్యర్థిగా మార్చింది. ఆదిమూలం బరిలో దిగనని తేల్చిచెప్పడంతో క్యాండెట్‌ను వైసీపీ మర్చాల్సి వచ్చింది.

ఇతర చోట్ల కూడా

సత్యవేడు నియోజకవర్గంలోనే కాదు చాలా చోట్ల అభ్యర్థులను మార్చింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌పై వ్యతిరేకత ఉందని సీటు మార్చింది. బందర్ ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేశ్ పేరును ప్రకటించింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌పై వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్ట్‌లో వచ్చింది. దీంతో ఆయనను నరసరావుపేట లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దింపింది. నరసరావుపేట లోక్ సభ అభ్యర్థిగా అనిల్ పేరు ఖరారు చేయడంపై స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా ప్రకటించారని మండిపడుతున్నారు. అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా గొట్టేటి మాధవి పేరు ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వంపై వ్యతిరేకత రావడంతో మార్చారు. ఇలా వ్యతిరేకత వచ్చిన చోట అభ్యర్థులను మారుస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 01 , 2024 | 08:33 AM

Advertising
Advertising