TDP: వైసీపీకి షాక్.. టీడీపీలోకి రెండు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నేతలు..
ABN, Publish Date - Apr 18 , 2024 | 01:02 PM
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు టీడీపీకి కొనసాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు చాలా వరకూ గట్టు దాటేశారు. ఇప్పుడు కింది స్థాయి నేతల వంతు వచ్చేసింది. నియోజకవర్గాల వారీగా వరుసబెట్టి టీడీపీలో చేరుతున్నారు. సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప అభివృద్ధి తెలియని జగన్ ప్రభుత్వం ఈసారి కుప్పకూలడం ఖాయమని భావిస్తున్న నేతలంతా ఆ పార్టీకి దూరమవుతున్నారు.
అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు టీడీపీ (TDP)కి కొనసాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు చాలా వరకూ గట్టు దాటేశారు. ఇప్పుడు కింది స్థాయి నేతల వంతు వచ్చేసింది. నియోజకవర్గాల వారీగా వరుసబెట్టి టీడీపీలో చేరుతున్నారు. సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప అభివృద్ధి తెలియని జగన్ ప్రభుత్వం ఈసారి కుప్పకూలడం ఖాయమని భావిస్తున్న నేతలంతా ఆ పార్టీకి దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే నేడు పెద్ద ఎత్తున రెండు ప్రాంతాల నుంచి వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.
CM Jagan: జగన్ బస్సు యాత్ర ఉంటే.. ఆ ఏరియాలో ఎవరూ బతకొద్దా?
నేడు భీమిలి, జీడీ నెల్లూరుకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వారందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కండువా కప్పి ఆహ్వానించారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయ నిర్మల వెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు)సేవా సంఘం అధ్యక్షులు దుక్క కృష్ణాయాదవ్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచులు గేదెల చంద్రారావు, నమ్మి వెంకట్రావు, భీమిలి 25వ వార్డు అధ్యక్షులు గడిదేశ సూర్యబాబు చేరారు. జీడి నెల్లూరు నుంచి సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ బాబు నాయుడు, మాజీ సర్పంచ్ జయచంద్ర నాయుడు చేరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నంద్యాల జిల్లా: ఆత్మకూరులో భారీ అగ్ని ప్రమాదం
భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం
Updated Date - Apr 18 , 2024 | 01:02 PM