మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Janasena-YCP: జనసేన అభ్యర్థికి వైసీపీ నేతల బెదిరింపులు

ABN, Publish Date - Apr 05 , 2024 | 08:31 AM

జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి ఇవాళ మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. పైగా బాలశౌరి మీటింగ్‌కు ఎవరెవరు వెళ్తున్నారో నోట్ చేసుకోవాలని రాజీనామా చేసిన వలంటీర్లకు వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారని సమచారం.

Janasena-YCP: జనసేన అభ్యర్థికి వైసీపీ నేతల బెదిరింపులు

విజయవాడ: జనసేన (Janasena) మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి ఇవాళ మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. పైగా బాలశౌరి మీటింగ్‌కు ఎవరెవరు వెళ్తున్నారో నోట్ చేసుకోవాలని రాజీనామా చేసిన వలంటీర్లకు వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారని సమచారం. మీటింగ్‌కి వెళ్ళిన వారి వివరాలు తమకు ఇవ్వాలని 3వ డివిజన్ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ భారతీ భర్త శీలం బాబ్జీ చెబుతున్నారు.

వలంటీర్లు నా సైన్యం!

వలంటీర్‌లను ప్రలోభ పెట్టేందుకు గంగులతోటలో ఇఫ్తార్ విందును వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందుకు రావాలని వలంటీర్ల గ్రూప్‌లో డిప్యూటీ మేయర్ భర్త శీలం బాబ్జీ వాయిస్ మెసేజ్ పంపారు. సోషల్ మీడియాలో ఈ వాయిస్ మెసేజ్ వైరల్‌గా మారింది. వైసీపీ నాయకుడు శీలం బాబ్జీ తీరుపై జనసేన నాయకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

YS Sharmila: నేడు కడపలో షర్మిల ప్రచారం.. మెయిన్ టార్గెట్ జగన్, అవినాశ్‌లేనా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 08:31 AM

Advertising
Advertising