ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: ఓడినా ‘అన్న’ బుద్ధి మారలే.. జగన్‌పై షర్మిల హాట్ కామెంట్స్..!

ABN, Publish Date - Aug 02 , 2024 | 09:28 PM

ఏపీ పాలిటిక్స్‌లో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏమాత్రం తగ్గగడం లేదు. తాజాగా మరోవైసారి వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు షర్మిల. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయినా జగన్ రెడ్డి తీరు మారలేదని విమర్శించారు. తనని కలవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలను తాడేపల్లి ప్యాలెస్‌ ముందు మెడపట్టి బయటకు..

YS Sharmila

అమరావతి, ఆగష్టు 02: ఏపీ పాలిటిక్స్‌లో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏమాత్రం తగ్గగడం లేదు. తాజాగా మరోవైసారి వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు షర్మిల. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయినా జగన్ రెడ్డి తీరు మారలేదని విమర్శించారు. తనని కలవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలను తాడేపల్లి ప్యాలెస్‌ ముందు మెడపట్టి బయటకు గెంటించారని దుయ్యబట్టారు. వివిధ జిల్లాల నుంచి జగన్‌ను కలవడానికి కార్యకర్తలకు చేదు అనుభవమే ఎదురవుతుందన్నారు. జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వైసీపీ కార్యకర్తల సెల్ ఫోన్లు విసిరేసి, మెడపట్టి బయటకు గెంటారని అన్నారు. ఇందుకే ఓడిపోయామని, అయినా జగన్ బుద్ధి మారలేదని ఆ కార్యకర్తలు తిట్టుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్లిపోయారని షర్మిల పేర్కొన్నారు.


ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనా ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ లేదని బతికించారా? లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అనే సామెతలా కేంద్ర ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. రూ. 6 వేల కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ఇక ముడి పదార్థాలు నిండుకున్నాయని, ఉక్కు తయారీకి ముడిపదార్థాలు నిండుకున్నాయని, కొనేందుకు చిల్లిగవ్వ కూడా లేదని, ఈ నెల జీతాలు కూడా ఇవ్వడం కష్టమేనని యాజమాన్యం చెబుతోందన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇలా చేతులెత్తేస్తుంటే.. ప్రధాని మోదీకి కనీసం చీమ కుట్టినట్లైనా లేదని విమర్శించారు.


అప్పు తీసుకొచ్చేందుకు గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదని కేంద్రం తీరుపై షర్మిల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో మూడోసారి గద్దెనెక్కిన మోదీ.. ఆంధ్రుల తలమానికం విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. లేదు లేదు అంటూనే ఆయన దోస్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. కుక్కను చంపాలి అంటే పిచ్చి దానిగా చిత్రీకరించినట్లు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూపాయి సహాయం చేయకుండా వెంటిలేటర్ మీదకు నెట్టారని విమర్శించారు. నిధులు ఇవ్వకుండా సైలెంట్‌గా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. త్వరలోనే అదానీ, అంబానీ, జిందాల్ లాంటి వాళ్లకు కట్టబెట్టే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని ఆరోపించారు. ‘ఏపీ బీజేపీ నేతలను, కూటమిలో భాగస్వామ్యం అయిన టీడీపీ, జనసేన పార్టీలను హెచ్చరిస్తున్నామని.. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేకుంటే.. ప్లాంట్ బలోపేతంపై మీకు చిత్తశుద్ధి ఉంటే.. తక్షణం ఆర్థిక సహాయం ప్రకటన చేయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు. కావాల్సిన ముడిపదార్థాలు వెంటనే సమకూర్చాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్లాంట్‌కు పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.


Also Read:

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..

సీఆర్డీఏలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

జగన్‌పై మంత్రి గొట్టిపాటి రవి ధ్వజం

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 02 , 2024 | 09:28 PM

Advertising
Advertising
<