మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Big Breaking: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల.. అధికారిక నిర్ణయం వచ్చేసింది!

ABN, Publish Date - Apr 01 , 2024 | 12:48 PM

కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాం గ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది.

Big Breaking: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల.. అధికారిక నిర్ణయం వచ్చేసింది!

ఢిల్లీ: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల (YS Sharmila) నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాం గ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టింది.

Pattabhi: వాలంటీర్లు తప్ప ప్రభుత్వానికి ఇంకా ఎవరూ లేరా?

రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. అయితే సీనియర్ నేత రఘువీరా రెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. ఏపీలో 117 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాలపై సీఈసీలో చర్చ జరిగింది. వీటిలో 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది. నంద్యాల, తిరుపతి,అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది.

TDP-Janasena: హమ్మయ్యా.. అలక తీరింది.. అక్కడ టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి..

ఇక రాజమండ్రి నుంచి గిడుగు రుద్ర రాజు బరిలోకి దిగనున్నారు. కడప లోక్ సభ నుంచి వైఎస్ షర్మిల.. విశాఖపట్నం నుంచి సత్యా రెడ్డి.. కాకినాడ నుంచి న్న పల్లం రాజు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండనున్నారు. బాపట్ల నుంచి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పోటీ చేయనున్నారు. వీటన్నింటిలోకి కడప స్థానమే హాట్ టాపిక్ కానుంది. ఇప్పటికే షర్మిల కడప నుంచి పోటీ చేస్తారంటూ వార్తలైతే వచ్చాయి కానీ అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆ వార్తలకు అంత ప్రాధాన్యత ఏర్పడలేదు. ఇప్పుడు అధికారికంగా తెలియడంతో హాట్ టాపిక్ అయిపోయింది. కడప అంటే సీఎం జగన్ సొంత ఇలాఖా.. అక్కడి నుంచి గత ఎన్నికల్లో ఆయన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కూడా ఆయనే బరిలోకి దిగనున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, సీఎం జగన్ స్వయానా సోదరి వైఎస్ షర్మిల బరిలోకి దిగనుండటంతో కడప ప్రజలు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

CM Jagan: జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీంలో ఏం జరిగిందంటే..

మరిన్ని ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Apr 01 , 2024 | 01:40 PM

Advertising
Advertising